నల్లబెల్లి, జూన్ 11: రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వం దేశం తెలంగాణ వైపు చూసేలా అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మామిండ్లవీరయ్యపల్లెకు చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ గ్రామ అధ్యక్షుడు కూస సురేశ్, యూత్ సభ్యుడు కూస రంజిత్‌తోపాటు పలువురు కార్యకర్తలు శనివారం నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పెద్ది వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల వారు టీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఊరటి అమరేందర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దేవతావిగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు
చెన్నారావుపేట: ఉప్పరపల్లిలోని శ్రీఆంజనేయ, నాగదేవత, ధ్వజస్తంభ నాభిశీల విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాన్ని శనివారం కనులపండువగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన పూజారి ఆదిత్యశర్మ ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ ఉప్పరపల్లిలో కిలో మీటర్ మేర సీసీరోడ్డు, ఆలయం లోపల సీసీ చేయిస్తానని హామీ ఇచ్చారు. తనవంతు సాయంగా బొడ్రాయి ఉత్సవాలకు రూ. 1,01,116 ఉత్సవ కమిటీకి అందించారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న, ఆర్బీఎస్ కన్వీనర్ బుర్రి తిరుపతి, పీఎసీఎస్ వైస్ చైర్మన్ చింతకింది వంశీ, సర్పంచ్ శ్రీధర్‌రెడ్డి, చెన్నారావుపేట సర్పంచ్ కుండె మల్లయ్య, ఎంపీటీసీ విజేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ రమేశ్, మాజీ జడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, మాజీ ఎంపీపీ జక్క అశోక్, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో మండలంలోని జల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు సబ్సిడీ పనిముట్లను వినియోగించుకోవాలని సూచించారు. ఎంపీపీ విజేందర్, సర్పంచ్ సతీశ్, ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో అనిల్, వీరారెడ్డి, గాదె భద్రయ్య, మహేందర్‌రెడ్డి, చెన్నారెడ్డి పాల్గొన్నారు.