నెక్కొండ, జూన్ 11 : నెక్కొండలో బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. శృంగేరి పీఠం వేదపండితుడు వ్యాసోజుల గోపీకృష్ణ ఘనంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. భూలక్ష్మి, మహాలక్ష్మి సమేత బొడ్రాయి, శీతల యంత్ర విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం రుత్విక్‌ల ఆధ్వర్యంలో బొడ్రా యి కమిటీ సభ్యులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ పాలకవర్గం సభ్యులను ఆశీర్వదించారు. మధ్యాహ్నం నుంచి గ్రామ దిగ్బంధనం చేపట్టారు.
శుక్రవారం రాత్రి నిర్వహించిన అమ్మవారి కుంకుమార్చనలో రెండు వేలమంది మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్‌కు చెందిన వేదపండితులు కొల్లాపురం సురేశ్, స్థానిక పురోహితులు బీవీఎన్ శాస్త్రి, శ్రావణ్శాస్త్రి, భవితేజ, అఖిల్, రజినీకాంత్, డింగిరి శేషపవన్కుమార్, రుత్విక్‌లతో పూజాకార్యక్రమాలు నిర్వహించారు. చల్లా గోదాముల అధినేత చల్లా శ్రీనివాస్‌రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో సర్పంచ్ సొంటిరెడ్డి యమునారంజిత్రెడ్డి, సొసైటీ చైర్మన్ మారం రాము, రైతు బంధు సమితి జిల్లా ప్రతినిధి చల్లా చెన్నకేశవరెడ్డి, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవ కమిటీ ప్రతినిధులు కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, రావుల హరీశ్‌రెడ్డి, పెండ్యాల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.