హనుమకొండ చౌరస్తా, జూన్ 11: వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్ సూచించారు. గ్రేటర్ వరంగల్ 4వ డివిజన్ జ్యోతిబసునగర్లో ఐసిస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, వాత్సల్య ఫౌండేషన్ సహకారంతో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చీఫ్ విప్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి మందులను అందించారు. ఈ సందర్భంగా క్యాంపును నిర్వహించిన వాత్సల్య ఫౌండేషన్ వారిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బొంగు అశోక్‌యాదవ్, డివిజన్ అధ్యక్షుడు మనోజ్‌కుమార్, టీఆర్ఎస్వీ కేయూఅధ్యక్షుడు ప్రశాంత్, డివిజన్ మాజీ అధ్యక్షుడు మనోహర్, స్థానిక డివిజన్ నాయకులు, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు.