గూడు కట్టడంలో గిజిగాడి తర్వాతే ఎవరైనా. ఒక్కో గడ్డిపోస తెచ్చి ఎంతో నేర్పుతో అదికూడా అందనంత ఎత్తున చెట్టుపై అద్భుతంగా అల్లేస్తుంది. అక్కడి నుంచి తన చుట్టూ ఉన్న ప్రపంచం కనిపించేలా కట్టుకొని గాలిలో ఊయ లూగుతూ హాయిగా పిల్లలతో బతికేస్తుంది. ఇలా ఓ ఈత చెట్టుకు పదుల సంఖ్యలో వేలాడుతున్న గిజిగాడి గూళ్లు బాటసారులను అమితంగా ఆకట్టుకున్నాయి. సగభాగం వరకు ఎండిపోయినట్టున్న ఆ చెట్టుపై.. అప్పుడే కట్టిన ఆకుపచ్చని, గోధుమ రంగు గూళ్లూ ఉండడం విశేషం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రంలో తారసపడిన ఈ దృశ్యాన్ని ‘నమస్తే’ తన కెమెరాలో బంధించింది.
– ఫొటోగ్రాఫర్ జయశంకర్ భూపాలపల్లి