వరంగల్, మార్చి 16 (నమస్తేతెలంగాణ) పదేళ్ల క్రితం రాజకీయంగా దుమారం రేపిన వరంగల్ జక్క లొద్ది భూముల వివాదం, తాజాగా ప్రభుత్వ నిర్ణ యంతో మరోసారి హాట్ టాపిక్లా మారింది. ఈ భూ ములపై సమగ్ర విచారణ చేపడుతామని శాసనసభలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించ డం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఆదేశాల తో ప్రధానంగా భూ ఆక్రమణదారుల్లో కలవరం మొద లైంది. వరంగల్ శివారులో ఉన్న జక్కలొద్ది గ్రామం లో భూస్వామి మొయినొద్దీన్ ఖాద్రీ కుటుంబానికి గతంలో 298.38 ఎకరాల భూములు ఉండేవి. ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని దశబ్దాల క్రితం సీలింగ్ యాక్టు అమల్లోకి రాగా ఆ సమయంలో ఖాద్రీ కుటుంబానికి చెందిన 298.38 ఎకరాలను ప్రభుత్వం మిగులు భూ ములుగా ప్రకటించింది. దీనిపై మొయినొద్దీన్ కుటుం బసభ్యులు అప్పట్లో అభ్యంతరం చెప్పారు. మిగులు భూమి కాదని, సీలింగ్ చట్టం ప్రకారం తమకే చెందు తుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ట్రిబ్యు నల్‌ను ఆశ్రయించారు.
విచారణ అనంతరం చివరకు 298.38 ఎకరాల్లో 79 ఎకరాలు మొయినొద్దీన్ కు టుంబానికి చెందుతాయని నిర్ణయం వెలువడింది. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం 298.38 ఎకరాల నుంచి ఆయన కుటుంబానికి 79 ఎకరాలను అప్పగించింది. ఇక రహదారులు, ఇతర అవసరాలకు పోగా మిగిలిన సుమారు 194 ఎకరాలను పదిహేను మంది దక్కించు కున్నారు. వీరిలో కౌలుదారులు, కబ్జాదారులు, ఇతరు లు ఉన్నారు. ఈ పదిహేను మంది కూడా సీలింగ్ యా క్టు పరిధిలోకి వస్తారనే ఫిర్యాదులతో ప్రభుత్వం విచా రణ జరిపింది. నలుగురు సీలింగ్ యాక్టు పరిధిలోకి వస్తారని తేలడంతో ప్రభుత్వం ఆ నలుగురి ఆధీనంలో ఉన్న 50.02 ఎకరాలను స్వాధీనం చేసుకు మిగులుగా ప్రకటించింది. మరో 143 ఎకరాలను పొందిన వారికి అప్పట్లో 38-ఈ సర్టిఫికెట్లను ఇచ్చింది. ఈ క్రమంలో ఆ భూముల వివాదం అనేక మలుపులు తిరిగింది.
అప్పటి నేతల కన్నుపడి..
వరంగల్ నగరం రోజురోజుకూ విస్తరిస్తుండడంతో జక్కలొద్ది భూముల విలువ అమాంతం పెరిగింది. ఒక్కో ఎకరానికి ధర రూ.కోట్లతో పలుకుతుండడంతో భూములపై పదేళ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో కొందరు నేతలు వీటిని కొట్టేసేందుకు పావులు కదిపారు. తమ పలుకుబడిని ఉపయోగించి నయానా, భయానా భూ ములను వశం చేసుకున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తా యి. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతులను బె దిరించి భూములు లాక్కున్నారనే ఆరోపణలొచ్చాయి.
టీఆర్ఎస్ పోరాటం
తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు నాటి కాం గ్రెస్ ప్రభుత్వం జక్కలొద్ది భూములను ఎరగా వాడు కుందనే విమర్శలు కూడా ఉన్నాయి. తమ పార్టీ నేతల కు గాలం వేసేందుకు కాంగ్రెస్ ఈ భూములను వాడు కుం దని, మొత్తం భూముల వ్యవహారంపై అప్పట్లో టీఆర్ఎస్ పోరాటం చేసింది. ఆ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న పెద్ది సుద ర్శన్‌రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమా లు నిర్వహించారు. జక్కలొద్ది భూముల రైతులకు న్యా యం చేయాలని, బలవంతంగా వారి భూములను కా జేసిన నేతలపై చర్యలు తీసుకోవాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆరోపణలు ఎదుర్కొన్న వారు అధికార పార్టీ నేతలు కావడంతో కాంగ్రెస్ ప్రభు త్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాజకీయ పలు కుబడితో అప్పట్లో జక్కలొద్ది భూములను దక్కించుకున్న వారి ఆధీనంలోనే ఇప్పటికీ అవి ఉన్నట్లు తెలిసింది.
విచారణకు రాష్ట్ర సర్కారు ఆదేశాలు
వరంగల్ జిల్లా కేంద్రానికి ఈవీఎం గోడౌన్లు, ఇతర ప్రభుత్వ శాఖల భవనాల నిర్మాణం కోసం భూమి అవ సరం కాగా జక్కలొద్దిలో ఉన్న 50.02 ఎకరాల మిగు లు భూములపై అధికారులు దృష్టి పెట్టారు. ఇటీవల వీటిని రెవెన్యూ అధికారులు సందర్శించారు. పరిశీలన లో ఇక్కడ మిగులు భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఇదే సమయంలో 50.02 ఎకరాల మిగు లు భూములను కొందరు కబ్జా చేశారని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కలెక్టర్ బీ గోపి విచా రణకు ఆదేశించారు. దీంతో వరంగల్ ఆర్డీవో మహేంద ర్జీ ఖిలావరంగల్ మండల రెవెన్యూ అధికారులతో కలిసి కొద్దిరోజుల క్రితం సర్వే చేసి సుమారు 22 ఎక రాలు ఆక్రమణకు గురైనట్లు తేల్చారు. ఈ 22 ఎకరా ల్లో కబ్జాదారులు వరి, ఇతర పంటలు వేయడం, తా త్కాలికంగా నిర్మాణాలు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగ ణించిన అధికారులు సదరు భూముల చూట్టూ మూ డు రోజులపాటు హద్దులు ఏర్పాటు చేశారు. సిమెంట్ పోల్స్ వేసి పెయింట్‌తో వాటిపై ‘ఇది ప్రభుత్వ భూమి’ అని రాశారు. తిరిగి మంగళవారం ఆర్డీవో మహేందర్ జీతో కలిసి కలెక్టర్ గోపి ఆక్రమణకు గురైన భూముల ను పరిశీలించారు. ఇదే సమయంలో మంగళవారం శాసనసభలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని జక్కలొద్దిలో వివాదంలో ఉన్న మొత్తం 298.38 ఎక రాల భూములపై విచారణ జరుపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ సమ గ్ర విచారణ చేపడుతామని ప్రకటించారు.. విచారణకు కసరత్తు కూడా మొదలవడంతో కబ్జాదారుల్లో ఆందో ళన మొదలైంది. కాంగ్రెస్ హయాంలోనే ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలొచ్చిన భూములు ఇపుడు విచార ణ జరిగే జక్కలొద్ది భూముల్లోనే ఉండగా ఇటు రాజకీ యంగానూ ఆసక్తి రేపుతున్నది.