వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 10: కాకతీయ మెడికల్ కళాశాలలో ‘ఉత్కర్ష’ ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. సాగింది. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ వేడుకలు శనివారంతో ముగిసాయి. చివరిరోజు వేడుకలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి హాజయ్యారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలకు వీసీ కరుణాకర్‌రెడ్డి బహుమతులు అందజేసి మాట్లాడారు. కేఎంసీ విద్యార్థులు వారి కళా నైపుణ్యాలను బయటపెట్టడంతో పాటు వైద్య రంగంలో సైతం రాణిస్తూ కేఎంసీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అందిస్తున్నారని, రానున్న రోజుల్లో కేఎంసీ ఖ్యాతిని మరింత పెంచేలా కృషి చేయాలన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ మాట్లాడుతూ.. విద్యార్థుల తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించి గతంలో కంటే ఎక్కువ స్థాయిలో వేడుకల విజయవంతానికి కృషి చేశారని, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.