సీఎం కేసీఆర్ తలపెట్టిన బీఆర్ఎస్ ఉన్నత స్థాయికి చేరుకొని జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రికి మరింత బలం చేకూర్చాలని మహిమాన్వితుడైన కందికొండ లక్ష్మీనర్సింహస్వామిని ప్రార్థించానని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పేర్కొన్నారు. కందికొండను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కరోనా వల్ల ఆలస్యం అయ్యిందన్నారు. అనంతరం డోర్నకల్ యువజన నాయకుడు డీఎస్ రవిచంద్ర మాట్లాడుతూ కందికొండను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే రెడ్యానాయక్ అహర్నిశలు కృషిచేశారన్నారు.
వచ్చే జాతర వరకు మెట్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. వారి వెంట కురవి ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవినాయక్, మహబూబాబాద్ మార్కెట్ చైర్పర్సన్ బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి, మహేందర్రెడ్డి, మరిపెడ డివిజన్ ఆత్మ చైర్మన్ తోట లాలయ్య, జిల్లా నాయకుడు పిచ్చిరెడ్డి, ఆలయ చైర్మన్ రామునాయక్, మాజీ చైర్మన్ రాజునాయక్, యతిరాజ్, బానోత్ రమేశ్, రాము, బానోత్ తుకారాం నాయక్, డీఎస్ రాంసింగ్, భోజ్యానాయక్, పెద్ది వెంకన్న, వినోద్, ప్రిన్స్రాజు, సూర్య, రాము, ముత్యం వెంకన్న పాల్గొన్నారు. అలాగే శ్రీనవ్య ఇండస్ట్రీస్, లక్ష్మీనర్సింహ ఆగ్రో ఇండస్ట్రీస్ల సంయుక్త ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని డీఎస్ రవిచంద్ర ప్రారంభించారు. కురవి జడ్పీటీసీ బండి వెంకట్రెడ్డి గుట్ట దిగువ భాగాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఐలి నరహరి, లక్ష్మారెడ్డి, వెంకట్రెడ్డి.కె, సుందర్, జి.నెహ్రునాయక్, అనిల్, కొమురయ్య, జానీమియా, హరిప్రసాద్, జీవన్, బోడ శ్రీను పాల్గొన్నారు.