హనుమకొండ, ఆగస్టు 19: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడంతోపాటు స్వా తంత్య్ర స్ఫూర్తిని కొనసాగిద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మానసిక దివ్యాంగులకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి మంత్రి ఎర్రబెల్లి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. బెలాన్లు ఎగురవేసి, మొకలు నాటారు.
ఈ సందర్బంగా దయాకర్‌రావు మాట్లాడుతూ మనో వికాస కేంద్రం అభివృద్ధికి అనేక మంది చేయూతనిచ్చారని తెలిపారు. అనాథలు, మానసిక వికలాంగులు అనేక మంది ఉన్నారని, వీరికి దాతలు సాయం చేయాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని ఎర్రబెల్లి తెలిపారు. ఇంటింటా జెండా కార్యక్రమం, మొకలు నాటడం, రక్తదానం వంటివి ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాసర్ మాట్లాడుతూ 21 సంవత్సరాలుగా వందలాది మందిని చేరదీసి వారికి ఆప్యాయత, అనురాగాలను పంచుతూ కన్న బిడ్డల్లాగా సాకుతున్న మనో వికాస కేంద్రం నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో ఎం. వాసుచంద్ర, జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ అన్నమనేని అనిల్ చందర్రావు, సీడీపీవోలు కే మధురిమ, కే శిరీష, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు కే అనితారెడ్డి, బాల సదనం పర్యవేక్షణ అధికారి ఎం కళ్యాణి, ప్రొటెక్షన్ అధికారి ఎస్ ప్రవీణ్‌కుమార్, పొక్సో పీపీఎం రంజిత్, సీనియర్ న్యాయవాది జీ వినోద్, మల్లికాంబ మనోవికాస కేంద్రం నిర్వాహకురాలు బండా రామలీల పాల్గొన్నారు.
దేవరుప్పుల : ఎందరో మహానుభావుల త్యాగాలతోపాటు శాంతియుత ఉద్యమంతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహనీయుల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిర్వహించిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం విజయవంతమై తెలంగాణ ఏర్పడిందన్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా మహిళా, శిశు, వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని సీతారాంపురం ప్రేమసదనం అనాథ వృద్ధ శరణాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
వృద్ధులను ఘనంగా సత్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ స్వాతంత్య్ర ఫలాలతో మనమంతా స్వేచ్ఛను అనుభవిస్తున్నామని తెలిపారు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యే యంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని వివరించారు. స మైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధికి నోచుకోలేదని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే సాగు, తాగునీరు, వి ద్యుత్ సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు.
అనాథ వృద్ధ శరణాలయానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రూ.లక్ష విరాళం ప్రకటించారు. విరాళాన్ని నిర్వాహకుడు బ్రహ్మచారికి అందిస్తానని తెలిపారు. శరణాలయ వ్యవస్థాపకుడు మాశెట్టి లక్ష్మీనారాయణ వందలాది మంది వృద్ధులను వారికి చేయూతనివ్వడం అభినందనీయమని ఎర్రబెల్లి పేర్కొన్నారు. శరణాలయానికి ప్రభు త్వం నుంచి సాయం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.
సర్పంచ్ రెడ్డిరాజుల రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా సంక్షేమాధికారి జయంతి, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, ఎంపీపీ బస్వ సావిత్రి, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఎంపీడీవో పుష్పలత, సంక్షేమశాఖ ఫీల్డ్ ఆఫీసర్ చింతకింది రాజు, డీసీపీవో రవికాంత్, సఖీ అడ్మిన్ రేణుక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, ప్రధాన కార్యదర్శి చింత రవి, నాయకులు పల్లా సుందరరాంరెడ్డి, బస్వ మల్లేశ్, కొల్లూరు సోమయ్య, టీఆర్ఎస్ గ్రామ కార్యదర్శి వెంకన్న, ఉపసర్పంచ్ యాకూబ్ పాషా, పంచాయతీ కార్యదర్శి స్వప్న పాల్గొన్నారు.