నర్సంపేట రూరల్, జూలై 26 : ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని డీఎల్పీవో వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం మండలంలోని గురిజాల, రాములునాయక్తండాల్లో జీపీ సిబ్బంది చేపట్టిన పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులను పరిశీలించి, పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశా రు.
కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్త మ సేవలు అందించాలని సూచించారు. విధులను బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. అదేవిధంగా మండలంలోని గురిజాల, ముత్తోజిపేట, ఇటుకాలపల్లి, దాసరిపల్లి, కమ్మపల్లి, మాధన్నపేట గ్రామాల్లో జీపీ సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లకు ఇరువైపులా చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, కార్యదర్శులు, కారోబార్లు ఉన్నారు.
చెన్నారావుపేట: పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని నోడల్ అధికారి ఉడ్రాతి సృజన్ తేజ సూచించారు. మంగళవారం మండలంలోని కోనాపురం, లింగాపురం ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిసరాలను, ‘మన ఊరు-మన బడి’ అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఉపాధ్యాయు లు విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఆంజనేయులు, రవీందర్, అజాం, తిరుపతి రెడ్డి, రవి, గంగాధర్, సీఆర్పీ సంపత్ పాల్గొన్నారు.
గీసుగొండ: గ్రామంలో నిత్యం పారిశుధ్య పనులను చేపడుతున్నట్లు సర్పంచ్ వాంకుడోత్ రజిత తెలిపారు. మండలంలోని సూర్యతండా గ్రామంలో మంగళవారం డ్రైనేజీలను శుభ్రం చేయించడంతో పాటు తండాల్లో నీరు నిల్వ ఉన్న ప్రదేశాను శుభ్రం చేయడంతో పాటు బ్లీచింగ్ ఫౌడర్ చల్లించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మహేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఖానాపురం: మండలంలోని బుధరావుపేటలో గ్రామ పంచాయతీలో విధులు నిర్వర్తించే పారిశుధ్య కార్మికులకు సర్పంచ్ కాస ప్రవీణ్‌కుమార్ తన సొంత నిధులతో మం గళవారం రేయిన్ కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆరోగ్య భద్రత రీత్యా రెయిన్కోట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు షేక్ సుభాన్‌భీ, మౌలానా, బిక్కి లింగమ్మ, మురళి, ఉపసర్పంచ్ రమామురళి, వార్డు సభ్యులు గట్ల సుదర్శన్, జమాల్, సమ్మయ్య, రాంనర్సింహారెడ్డి, లచ్చ య్య, యాకూబ్‌పాషా, కార్యదర్శి రజిత పాల్గొన్నారు.