న్యూశాయంపేట, జూలై 26: టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి కాపాడుకుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.గ్రేటర్ పరిధి 1, 2 డివిజన్ల పరిధి పెగడపల్లిలో ఇతర పార్టీలకు చెందిన వంద మంది నాయకులు, కార్యకర్తలు మంగళవారం హనుమకొండ హంటర్‌రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఇంటిపార్టీ అని, టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, కళ్లెదుటే కనిపిస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్లు నరెడ్ల శ్రీధర్, జంగ కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పన సింగ్‌లాల్, ఏఎంసీ డైరెక్టర్ గణిపాక విజయ్, కుడా డైరెక్టర్ నన్నెబోయిన రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.
కరీమాబాద్: రాష్ట్ర అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మంగళవారం 43వ డివిజన్లో రూ.40లక్షల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అభివృద్ధి పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలా అండగా అధికారులతో కలిసి డివిజన్లోని పలు కాలనీల్లో తిరుగుతూ సమస్యలను పరిశీలించారు. తహసీల్దార్ ఫణికుమార్, డీఈ నరేందర్, అరుణ, ఇనుగాల జోగిరెడ్డి, అకినెపెల్లి స్పందన్ ల్గొన్నారు.