శాయంపేట, జూన్ 13 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని కొత్తగట్టుసింగారం గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో సోమవారం వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని నర్సరీని గండ్ర దంపతులు పరిశీలించారు. వానలు పడిన తర్వాత హరితహారంలో మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని సూచించారు.
నర్సరీల్లో అన్ని రకాల మొక్కలను సిద్ధం చేయాలన్నారు. అనంతరం గండ్ర జ్యోతి గ్రామంలోని అన్ని కాలనీల్లో కలియదిరిగి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. రోడ్లు, పారిశుధ్య పనులు, పాఠశాలను సందర్శించారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుధ్య లోపం ఉండడంతో జీపీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో అందరికీ ఉపయోగపడేలా క్రీడా మైదానాలు ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. పల్లెప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామాలను అందంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ తిరుపతిరెడ్డి, ఎంపీడీవో కృష్ణమూర్తి, సర్పంచ్ సంతోష, ఎంపీవో రంజిత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
దామెర : పల్లెప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. సోమవారం దామెర మండలం తక్కళ్లపహాడ్, ఊరుగొండ, పసరగొండలో ప్రభు త్వ పాఠశాలలు, పల్లెపకృతివనాలు, నర్సరీలు, ఫార్మేషన్ రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. పసరగొండ, ఊరుగొండలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు కోసం స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గ్రా మాల్లో చేపట్టే అభివృద్ధి పనులను గుర్తిం చి, సత్వరం పూర్తి చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతోపాటు అంతర్గత రోడ్లను నిర్మిస్తూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కాగితాల శంకర్, వైస్ ఎంపీపీ జాకీర్‌అలీ, సర్పంచ్‌లు గోగుల సత్యనారాయణ రెడ్డి, మేడిపల్లి సాంబయ్య, బింగి రాజేందర్, డీఆర్డీవో శ్రీనివాస్ కుమార్, తహసీల్దార్ రియాజొద్దీన్, మండల స్పెష ల్ అధికారి మాధవీలత, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, ఎంపీవో యాదగిరి, ఏపీవో శారద పాల్గొన్నారు.
హసన్‌పర్తి : మండలంలోని ప్రతి గ్రా మం ఆదర్శంగా తయారు కావాలని ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని బైరాన్‌పల్లి, సిద్ధాపూర్, అర్వపల్లి, మల్లారెడ్డిపల్లి, కొత్తపల్లి, హరిశ్చంద్రనాయక్ తండా గ్రామాల్లో పల్లె పకృతివనాలు, శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు, నర్సరీలను ఎంపీడీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మండలంలో రోడ్డుకు ఇరుపక్కల మొక్కలు నాటాలన్నారు. గ్రామంలో డ్రైనేజీలు, రోడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ అర్చనాక్రాంతి, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పెసరు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ జక్కు రమేశ్ గౌడ్, సర్పంచ్‌లు జనగాం ధనలక్ష్మి-కిరణ్, సాంబరెడ్డి, జెన్నయ్య, శాంతి-భగత్, శ్రీలత-రామరాజు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, ఎంపీటీసీలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
భీమదేవరపల్లి : మండలంలోని రాంనగర్ గ్రామంలో నర్సరీ, పల్లెప్రకృతి వనాన్ని ఎంపీడీవో భాస్కర్ పరిశీలించారు. గ్రామంలోని వీధులన్ని కలియతిరిగారు. వర్షాకాలం సమీపించినందున వీధుల్లో క్లోరినేషన్ చేయాలని అధికారులకు సూ చించారు. నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట వీధిదీపాలు అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా కవిత, ఎంపీవో నాగరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ రాజమల్లారెడ్డి, వాటర్ గ్రిడ్ ఏఈఈ సాయికృష్ణ పాల్గొన్నారు.