బడిగంట మోగడంతో సోమవారం విద్యార్థులు ఉత్సాహంగా బడిబాట పట్టారు. మొన్నటివరకు ఆటపాటల్లో మునిగితేలిన పిల్లలు.. పాఠశాలల పునఃప్రారంభంతో మెల్లిగా బడి వైపు కదిలారు. భుజానికి బ్యాగులు వేసుకొని స్నేహితులు, తోటివారితో కలిసిరావడంతో తొలిరోజు స్కూళ్లన్నీ సందడి మారాయి. కొందరు చిన్నారులైతే స్కూల్‌కు వెళ్లేందుకు మారాం చేయగా తల్లిదండ్రులు వారిని బతిమి లాడి తీసుకురావాల్సి వచ్చింది. ఇక తరగతి గదులు, ఆవరణను ముందుగానే బ్లీచింగ్, శానిటైజర్‌తో శుభ్రం చేయించడంతో పాటు గేట్లకు మామిడి తోరణాలు, బెలూన్లు కట్టి ముస్తాబు చేయడంతో పండుగ వాతావరణం కనిపించింది. అలాగే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పూలు ఇచ్చి ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. అనంతరం పిల్లలు గురువులకు నమస్కరించి.. తోటివారిని పలుకరిస్తూ తరగతులకు వెళ్లారు.
– ఫొటోగ్రాఫర్, జనగామ/దేవరుప్పుల