రేగొండ, జూన్ 8: సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించనున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. మండలంలోని నిజాంపల్లి, గోరికొత్తపల్లి, వెంకటేశ్వర్లపల్లి, జగ్గయ్యపేట గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలతోపాటు మన ఊరు – మనబడి పథకం పాఠశాలల్లో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాతకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు.
గ్రామీణ పాఠశాలలకు ప్రభుత్వం పెద్ద పీటవేస్తూ విద్యా వ్యవస్థను మరింత ప్రతిష్టం చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించి, ఆంగ్లవిద్య బోధన అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, తాగునీరు, డైనింగ్ హాల్, క్రీడా వైదానం, అదనపు తరగతి గదుల నిర్మాణం వంటి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలను చేర్పించాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతితో పల్లెల్లో పట్టణ వాతావరణం నెలకొంటోందన్నారు. పచ్చని చెట్లు, సుందరమైన రోడ్లు కపిస్తున్నాయని తెలిపారు. మండల ప్రత్యేక అధికారి సామ్యూల్, ఎంపీడీవో సురేందర్ గౌడ్, ఎంపీపీ పున్నం లక్ష్మి, జడ్పీటీసీ సాయిని విజయ, సర్పంచ్‌లు పాతపెల్లి సంతోశ్, రజిత, చిగురు మామిడి రజితరాజు, ఇందిర, ఎంపీటీసీలు గండు కుమార స్వామి, హమీద్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మటిక సంతోశ్, అంకం రాజేందర్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ రహీం, చైర్మన్ మహేందర్, నాయకులు మోడెం ఉమేశ్‌గౌడ్, మైస భిక్షపతి, ప్రతాప్‌రెడ్డి, తిరుపతిరావు, అముల రాజయ్య, పాపిరెడ్డి ఉన్నారు.