పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నియోజకవర్గంలో రోజుకో మండలంలో పర్యటిస్తున్నారు. సమస్యలను పరిశీలిస్తూ పరిష్కారానికి సూచనలు చేస్తున్నారు. ఆరో రోజైన బుధవారం రేగొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి చెత్తాచెదారం, డ్రెయినేజీల క్లీనింగ్‌ను పరిశీలించారు. భూపాలపల్లి డీపీవో ఆశాలత మహదేవపూర్ మండలం సూరారం, బెగ్లూర్, ఎల్కేశ్వరం, అంబట్పల్లి గ్రామాల్లో పరిశీలించారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు పుల్లూరి రామయ్యపల్లిలో కొనసాగుతున్న పట్టణ ప్రగతి పనులను చూశారు. జడ్పీ సీఈవో శోభారాణి మల్హర్ మండలం ఆన్సాన్పల్లి గ్రామాన్ని సందర్శించారు. వన నర్సరీలో మొక్కల పెంపకంపై సూచనలు చేశారు. భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా మున్సిపాలిటీలోని 2, 14, 22 వార్డుల్లో పర్యటించారు. ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఏటూరునాగారం మండలం శివ్వాపూర్‌లో నర్సరీలు, పల్లెప్రకృతి వనాలను పరిశీలించారు.
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 8 (నమస్తే తెలంగా ణ): పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరుగా సాగు తున్నాయి. జిల్లాలోని 241 గ్రామ పంచాయతీల్లో ఐదో విడత పల్లెప్రగతి, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 4వ విడత పట్టణ ప్రగతిలో భాగంగా పనులు ముమ్మ రంగా చేస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కమిషనర్ శ్రీనివాస్‌తోపాటు వార్డుల కౌన్సిలర్లు తమ వార్డులో చెత్తాచెదారం తొలగించే పనులు పరిశీలిస్తున్నారు.
ఖాళీ ప్లాట్లలో నీరు నిల్వకుండా, డ్రెయినేజీ సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నారు. భూపాలపల్లి నియో జకవర్గంలోని ఆరు మండలాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పల్లెప్రగతి కార్యక్రమాల్లో పాల్గొంటు న్నారు. రోజుకో మండలానికి సమయాన్ని కేటాయిస్తు న్నారు. పారిశుధ్య సమస్యలపై సూచనలు చేస్తున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో ఉన్న ఖాళీ ప్లాట్లలో చెత్తాచెదారం తొలగింపు, డ్రెయినేజీ వ్యవస్థ పునరుద్ధరణ, మొక్కల పెంపకం, తాగునీటి సరఫరాపై దృష్టిసారించారు. వార్డుల్లో రోడ్డుకు ఇరువైపుల ఏపుగా పెరిగిన చెత్తను పారిశుధ్య కార్మికులతో తొలగించడాన్ని మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు పర్యవేక్షిస్తున్నారు. ఖాళీ ప్లాట్లలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించడంతోపాటు ప్లాట్ల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఖాళీ ప్లాట్లలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. కలెక్టర్ భవేష్‌మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకర, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జడ్పీ సీఈఓ శోభరాణి నిత్యం పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.