హనుమకొండ చౌరస్తా, జూన్ 8: కార్మిక నాయకుడు, కమ్యూనిస్టు యోధు డు బీఆర్ భగవాన్దాస్ స్ఫూర్తితోనే కార్మికుల హకుల రక్షణకు పోరాడుతున్నామని చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు. బీఆర్ భగవాన్దాస్ 92వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం హ నుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల జంక్షన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్దాస్ విగ్రహానికి చీఫ్ విప్ వినయ్ భాసర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి భిక్షపతి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వినయ్భాసర్ మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల హకులను కేంద్రం హరిస్తోందన్నారు.
కేంద్రానికి వ్యతిరేకంగా కార్మికుల హకుల కోసం పోరాడుతున్నామన్నారు. పార్టీలు వేరైనా అందరికీ ఆదర్శంగా నిలిచిన ఉకు మనిషి భగవాన్దాస్ అని అన్నారు. నగరంలో బీఆర్ భగవాన్దాస్, కాళీదాస్ పేదలకు ఇండ్ల స్థలాల కోసం పోరాడారని, ఇప్పటికే నిరుపేదలైన గుడిసెవాసులకు ఇండ్ల స్థలాలు ఇచ్చామని, ఇంకా చెరువు శిఖం భూముల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నందున ఇప్పించలేకపోయామన్నారు. జీవో 58, 59 ప్రకారం అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం అందరినీ కలుపుకుని పోరాడుతామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ వరంగల్లోని బీఆర్ నగర్లో భగవాన్దాస్ విగ్రహం ఏర్పాటు చేయాలని, అందుకు తన వంతు సహకా రం అందిస్తానని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, భగవాన్దాస్ కుమారులు డాక్టర్ బీఆర్ అంబేదర్, బీఆర్ లెనిన్, కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, వేముల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు తాడిశెట్టి విద్యాసాగర్, మాడిశెట్టి శివశంకర్, వీరగంటి రవీందర్, నాయకులు పులి రజనీకాంత్, నయీమొద్దీన్, సీపీఐ జిల్లా నాయకుడు మద్దెల ఎల్లేశ్, కొట్టెపాక రవి, కండె నర్సయ్య, మాలోతు శంకర్, బుద్ధభవన్ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.