లింగాలఘనపురం, జూన్ 8 : గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని, నాలుగు విడుతలుగా జరిగిన ప్రగతిని సమీక్షించి ఐదో విడుతలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా బుధవారం ఆయన లింగాలఘనపురం, నవాబుపేట, చీటూరు గ్రామాల్లో ఏర్పా టు చేసిన క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు.
అనంతరం మండల కేంద్రంలోని హైస్కూల్లో జరిగిన సమావేశంలో రాజయ్య మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నాలుగు విడుతల్లో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమాల్లో చర్యలు తీసుకున్నామన్నారు. పల్లె ప్రజల కోసం కబడ్డీ, వాలీబాల్, ఖోఖోలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకే క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మండలంలో 13 పాఠశాలలను ఈ కార్యక్రమంలో చేపట్టి రూ.30 లక్షలు మంజూరు చేశామని రాజయ్య తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకరు అందించామన్నారు. పల్లెలు ఆహ్లాదకరంగా ఉండేలా పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, సెగ్రిగేషన్ఫెడ్లు, సీసీ రోడ్లు నిర్మించామని రాజయ్య తెలిపారు. అభివృద్ధిని ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సర్పంచ్‌లకు నిధులు మంజూరు కాలేదని ఆరోపణలు చేస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, ఎంపీపీ చిట్ల జయశ్రీ, టీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు బస్వగాని శ్రీనివాస్‌గౌడ్, గవ్వల మల్లేశం, నాయకులు బొల్లంపెల్లి నాగేందర్, గువ్వల రవి, మబ్బు కరుణాకర్, విష్ణు, కొత్తకొండ గంగాధర్, గట్టగల్ల శ్రీహరి, స్పెషలాఫీసర్ లత, ఎంపీడీవో సీతారాంనాయుడు, ఎంపీవో మల్లికార్జున్, నోడల్ ఆషీసర్ విష్ణుమూర్తి, పద్మ, మమత, జ్యోతి, సర్పంచ్‌లు సాదం విజయమనోహర్, బూడిద జయరాజేశ్వర్‌గౌడ్, ఐల మల్లేశం, ఎంపీటీసీలు సోమలక్ష్మి, కేమిడి భిక్షపతి, తీగల సిద్ధ్దూగౌడ్, డాక్టర్ అనిత, కరుణాకర్‌రాజు, ప్రవీణ్‌కుమార్, ఏఈ మధు, బాలకృష్ణ , ఉపసర్పంచ్ కేమిడి కవితావెంకటేశ్ , కారోబార్ బోయిని సురేశ్‌కుమార్,అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా నెల్లుట్లలో జరిగిన మన ఊరు- మనబడి కార్యక్రంలో అదనపు కలెక్టరు భాస్కర్‌రావు, ఎంపీపీ చిట్ల జయశ్రీ, సర్పంచ్ చిట్ల స్వరూపారాణి స్పెషలాఫీసర్ లత , పంచాయతీ కార్యదర్శి రొండ్ల శ్రీనివాస్‌రెడ్డి, కారోబార్ సురేశ్‌కుమార్ పాల్గొన్నారు.
బచ్చన్నపేట : పల్లెల్లో మౌలిక వసతులు కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టిందని ఎంపీపీ బావండ్ల నాగజ్యోతీకృష్ణంరాజు, జిల్లా వ్యవసాయాధికారి, మండల ప్రత్యేకాధికారి వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ఆలింపూర్, వీఎస్ఆర్.నగర్, నారాయణపూర్, పోచన్నపేట, కట్కూర్ గ్రామాల్లో వారు పర్యటించారు. పల్లెప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పల్లెప్రకృతి వనం, శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్, నర్సరీని ఏర్పాటు చేశామన్నారు.
మరోవైపు తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సెగ్రిగేషన్ షెడ్లలో ప్రతి రోజూ తడిపొడి చెత్తను వేరు చేయాలన్నారు. షెడ్ చుట్టూ బయోఫెన్సింగ్లు పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో రెండు లక్షల మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించి, గుంతలు తీసి సిద్ధంగా ఉంచాలన్నారు. అనంతరం కట్కూర్లో క్రీడా ప్రాంగణానికి భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు నరెడ్ల బాల్‌రెడ్డి, కోనేటి స్వామి, మాసపేట రవీందర్‌రెడ్డి, గట్టు మంజులామల్లేశం, ముశిని సునీతారాజుగౌడ్, ఆర్‌డబ్య్లూఎస్ ఏఈ అరుణ, ట్రాన్స్‌కో ఏఈలు సత్తయ్య, నాగేందర్, పీఆర్ ఏఈ శ్రీనివాస్, ప్రత్యేకాధికారులు రాజు, పంచాయతీ కార్యదర్శులు రేవతిగౌడ్, రుబీనా, దేవీప్రసాద్, శ్రీనివాస్, ప్రశాంత్ఆచార్య తదితరులు పాల్గొన్నారు.
దేవరుప్పుల : మండలంలోని సింగరాజుపల్లి, పెదమడూరు, ధర్మగడ్డ తండా, కామారెడ్డిగూడెంలో క్రీడామైదానాల కోసం అధికారులు స్థల పరిశీలన చేశారు. మండల ప్రత్యేకాధికారి, డీపీవో రంగాచారి, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో రాజలింగం నేతృత్వంలో ఆయా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. అనంతరం పల్లెప్రగతి పనులపై ఆరా తీశారు. పరిసరాల శుభ్రత, వీధిలైట్ల ఏర్పాటు, విరిగిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవాటి ఏర్పాటును పర్యవేక్షించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌లు గోపాల్‌దాస్ మల్లేశ్, ఆకవరం సుజనారెడ్డి, కవిత, బిళ్ల అంజమ్మ, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు
పాలకుర్తి :పల్లెప్రగతిలో భాగంగా బుధవారం మండల కేంద్రంలో విద్యుత్ లైన్ మరమ్మతు పనులు చేపట్టారు. పలు వీధుల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేసి మిడిల్ పోల్స్ ఏర్నాటు చేశారు. ఈ సందర్భంగా ఏఈ సుమన్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.