టీఎస్ఆర్టీసీ అందిస్తున్న కార్గో, పార్సిల్ సేవలను ప్రజలు ఆదరిస్తున్నారు. సులభంగా.. సురక్షితంగా సరుకులను సిబ్బంది గమ్యస్థానాలకు చేరుస్తుండడంతో రోజురోజుకూ సేవలు విస్తరిస్తున్నాయి. సంస్థ ఉన్నతాధికారులు మహబూబాబాద్ డిపో పరిధిలో మరిపెడ, కేసముద్రం, ఇనుగుర్తిలో పాయింట్లను ఏర్పాటు చేశారు. మరికొద్ది రోజుల్లో బయ్యారం, గార్ల మండలాల్లో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా యత్నిస్తున్నారు. కార్గో, పార్సిల్ సేవలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ. 22,14,545 ఆదాయం వచ్చింది. త్వరలో హోం డెలివరీ చేసేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
బయ్యారం, జూన్8: టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు ప్రజ ల ఆదరాభిమానాలు చూరగొంటున్నాయి. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు సంస్థ ఎండీ సజ్జన్నార్ అనేక సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగా తలపెట్టిన కార్గో, పార్సిల్ రవాణా విజయవంతంగా ముందుకుపోతోంది. మహబుబాబాద్ బస్సు డిపోలో జూన్ 19, 2020న పార్సిల్, కొరియర్, కార్గో సేవలు ప్రారంభించారు.
అప్పటి నుంచి డిసెంబర్ వరకు 4522 పార్సిళ్లు బుక్ చేయగా, రూ. 3,80,872 ఆదా యం వచ్చింది. అదేవిధంగా 2021 నుంచి డిసెంబర్ వరకు 12,634 పార్సిళ్లు బుక్ చేయగా, రూ. 12, 63,375 ఆదాయం సమకూరింది. 2022 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 8782 పార్సిళ్లు బుక్ చేయగా రూ. 5,70,298 ఆదాయం వచ్చింది. అంతేకాకుండా ఇప్పటి వరకు 55,058 వివిధ బస్సు డిపోల్లో బుక్ అయిన పార్సిళ్లను వినియోగదారులకు అందించారు. అంతేకాకుండా వరంగల్‌లోని సెంట్రల్ స్టోర్ నుంచి జి ల్లాలోని పీహెచ్‌లకు పంపిణీ చేసే మందుల రవాణ సైతం కార్గో ద్వారా చేస్తుండడంతో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రతి నెలా ఆదాయం లభిస్తున్నది.
కార్గో సేవలు విస్తరించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటి వరకుబస్ డిపోకు వచ్చి పా ర్సిల్ బుక్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రతి మండల కేంద్రంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. అందులో భాగంగా ప్రస్తుతం జిల్లాలోని మరిపె డ, కేసముద్రం, ఇనుగుర్తిలో కార్గో పాయింట్లను ఏ ర్పాటు చేశారు. త్వరలో బయ్యారం, గార్ల మండలాల్లో సైతం ప్రారంభించనున్నారు.
ఆర్టీసీ కార్గో సేవలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సరుకు, వస్తు రవాణాకు సులువైన మార్గంగా ఎంచు కొంటున్నారు. అంతేకాకుండా సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఓ మార్గంలా నిలుస్తున్నది. సమ్మక్క సారల్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం కార్గో ద్వారా తల్లులకు బంగారం (బెల్లం) మొక్కు చెల్లింపులు, భ ద్రాచలం సీతారామ కల్యాణం సందర్భంగా తలంబ్రా లు, ఇంటి వద్దకే నాణ్యమైన మామిడి పండ్ల అందజేత వంటి వినూత్నంగా చేపట్టిన సేవలు ప్రజలు వినియో గించుకోవడంతో సంస్థ ఆదాయం పెరుగుతోంది.
టీఎస్ఆర్టీసీ ద్వారా అందుతున్న పార్సిల్ సేవ లను మరింత విస్తరిస్తాం. జిల్లాలో మూడు కార్గో పాయింట్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో ప్రతి మండలంలో ఒక్కో పాయింట్ ఉండేలా చర్య లు తీసుకుంటున్నాం. వీటి ద్వారా ఇప్పటి వరకు రూ. 22,14,545 ఆదాయం అచ్చింది. రాను న్న రోజు ల్లో హౌం డెలివరీ కూడా చేస్తాం.
– కల్పనాదేవి, డీఎం, మహబుబాబాద్