నర్సంపేటరూరల్, జూన్ 8: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం పనులు జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి వీధిలో పర్యటిస్తూ స్థానికులతో మాట్లాడి సమస్యలను గుర్తిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లతో డ్రైనేజీలు, రోడ్లను శుభ్రం చేయిస్తున్నారు.
నర్సంపేట మండలంలోని దాసరిపల్లి, పాతముగ్ధుంపురం, ముత్యాలమ్మతండా, రాములునాయక్‌తండా, ముగ్ధుంపురం, ముత్తోజిపేట, భాంజీపేట, చంద్రయ్యపల్లి, రాజేశ్వర్రావుపల్లి, భోజ్యానాయక్తండాలో బుధవారం సర్పంచ్‌లు పెండ్యాల శ్రీనివాస్, సుంకరి లావణ్య, భూక్యా సైద, అజ్మీరా మాధవి, పెండ్యాల జ్యోతి, గోలి శ్రీనివాస్‌రెడ్డి, పలకల పూలమ్మ, బరిగెల లావణ్య, బొజ్జ యువరాజ్, భూక్యా లలిత ఆధ్వర్యంలో వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, పారిజాతం, రజాక్, ఫాతిమామేరి, ఝాన్సీ, వింధ్య, రజినీకాంత్, కార్యదర్శులు, కారోబార్లు పాల్గొన్నారు.
పర్వతగిరి: పల్లెప్రగతి పనులను పకడ్బందీగా చేయాలని అడిషనల్ కలెక్టర్ బీ హరిసింగ్ అధికారులకు సూచించారు. బుధవారం ఆయన మండలకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుధ్య పనులు చేస్తున్నారా అని ఆరా తీశారు. గ్రామంలోని వీధుల్లో పర్యటించి రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పల్లెప్రగతి పనులపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చక్రాల సంతోష్‌కుమార్, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో సుశీల్‌కుమార్, కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు.
నల్లబెల్లి: ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెలు పరిశుభ్రంగా తయారవుతాయని మండల ప్రత్యేక అధికారి జహీరొద్దిన్ అన్నారు. ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు బుధవారం పారిశుధ్య పనులతోపాటు వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించారు. అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లించి, దోమల నివారణకు వీధుల్లో ఫాగింగ్ చేయించారు. అలాగే, పల్లెప్రకృతి వనాల సంరక్షణ, డంపింగ్ యార్డుల్లో వర్మీకంపోస్టు తయారీ, తడి, పొడి చెత్త సేకరణ, గ్రామాల సుందరీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
పల్లెప్రగతిలో భాగంగా మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, ఏపీవో వెంకటనారాయణ పనులను పరిశీలించారు. వారి వెంట సర్పంచ్‌లు, కార్యదర్శులు ఉన్నారు. అలాగే, ఎండీడీవో విజయ్‌కుమార్ లెంకపెల్లిలోని ఊర చెరువు శిఖం భూమిని పరిశీలించారు. అనువైన స్థలం లభిస్తే బృహత్ పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ మేకల లక్ష్మి ఉన్నారు.
దుగ్గొండి/రాయపర్తి: పల్లెప్రగతి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో బుధవారం పల్లెప్రగతి పనులు చేపట్టారు. రహదారులతోపాటు వీధులను శుభ్రం చేయించారు. అనంతరం పచ్చదనం-పరిశుభ్రతపై గ్రామస్తులతో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రత్యేకాధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమన్నారు.
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల శుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, తాసిల్దార్ సంపత్‌కుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు. రాయపరి శివారులోని ముకుందారెడ్డి కంచెలో బృహత్ పల్లెప్రకృతి వనంలో మొక్కల సంరక్షణ కోసం సర్పంచ్ గారె నర్సయ్య బోరు ఏర్పాటు పనులను ప్రారంభించారు. కార్యదర్శి గుగులోత్ అశోక్‌నాయక్, కారోబార్ కారుపోతుల రాంచంద్రయ్య పాల్గొన్నారు.
సంగెం: పల్లెప్రగతితోనే గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయని జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ముమ్మిడివరంలోని వైకుంఠధామం, పల్లెప్రకృతి వనంలో జడ్పీటీసీ రూ. 2.20 లక్షలతో బోరు పనులను జడ్పీటీసీ, ఎంపీపీ కళావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పల్లెలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లయ్య, సర్పంచ్‌లు ఇజ్జగిరి స్వప్న-అశోక్, గూడ కుమారస్వామి, మేరుగు మల్లేశం, ఎంపీటీసీలు కట్ల సుమలత, కొనకటి రాణి-మొగిలి, మన్సూర్ అలీ, ఉపసర్పంచ్ నాల్లం వీరస్వామి, కార్యదర్శి రమేశ్, పురుషోత్తం, ప్రవీణ్, ప్రశాంత్, అక్క మొగిలి పాల్గొన్నారు.