తేలుకంటి భరత్ కుటుంబానికి గ్రామస్తుల చేయూత
తేలుకంటి భరత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన తేలుకంటి భరత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే.. దవాఖానలో చికిత్స పొందుతుండగా, వైద్య ఖర్చు నిమిత్తం గ్రామానికి చెందిన ఒక్కురోళ్లం, ప్రగతి యూత్ అసోసియేషన్ లో ఉన్న సభ్యులంతా గ్రూప్ అడ్మిన్ బొమ్మెన కేశవర్ధన్ (బొమ్మేనరాజు ) విజ్ఞప్తి మేరకు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రూపాయి 70 వేల వరకు ఆర్థిక సహాయం అందించారు. అయినా కూడా భరత్ పరిస్థితి విషమించి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు ఆలు ము కున్నాయి.
గ్రామస్తులందరితో తలలో నాలుకలా ఉండే భరత్ అకాల మృతి కుటుంబానికి తీరం లోటని కొనియాడారు. ఈ మేరకు దాతలు అందించిన ఆ మొత్తాన్ని గ్రూప్ అడ్మిన్ రాజు ఆధ్వర్యంలో సోమవారం భరత్ తల్లి అరుణ సోదరుడు సాయి ప్రదీప్ కు అందించారు. తన కుమారుడు ఆరోగ్యం కోలుకోవాలని అందరూ ఆశీర్వదించి ఆర్థిక సహాయం అందించిన రెండు గ్రూపుల సభ్యులకు అరుణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రెండు గ్రూపుల సభ్యులు గిరబోయిన అంజయ్య, కొత్తపెళ్లి ప్రవీణ్, దొంతుల చంద్రమౌళి, తేలు కంటి శ్రీనివాస్, గుంటిపల్లి మల్లికార్జున్, బాసెట్టి వేణు, గిరబోయిన బాల సిద్ధులు, తేలు కంటి వెంకట్ రాజు, గిరబోయిన పరశరాములు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారు నడిపిన బీజేపీ కార్పొరేటర్ మైనర్ కుమారుడు.. బైక్‌ను ఢీకొట్టడంతో దంపతులు మృతి
Lungs Health | చలికాలంలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను తీసుకోవాలి..
OTT Movies | దృశ్యం 3 నుంచి హనుమాన్ అంశ్ వరకు.. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు!
Stock market | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు ఆవిరి..!
‘ఐలు నల్లగొండ 12వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

