Hanumakonda | మహిళా క్రికెట్ పోటీల్లో వరంగల్ జట్టు శుభారంభం.. మరో మ్యాచ్‌లో ఖమ్మం ముందజ
అంతర్ జిల్లాల మహిళా టీ-20 క్రికెట్ పోటీల్లో వరంగల్ జట్టు మెదక్ జట్టుపై 56 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి శుభారంభం చేసిందని వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డబ్ల్యూడీసీఏ) కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 2: వరంగల్ వేదికగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 2 నుంచి 7 వరకు జరగనున్న అంతర్ జిల్లాల మహిళా టీ-20 క్రికెట్ పోటీల్లో వరంగల్ జట్టు మెదక్ జట్టుపై 56 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి శుభారంభం చేసిందని వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డబ్ల్యూడీసీఏ) కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. వంగాలపల్లిలోని వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వరంగల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. వరంగల్ ఓపెనర్ సాయి ధృవిగ్య్న 56 బంతుల్లో 9 బౌండరీల సహాయంతో 62 పరుగులు చేసి అజేయంగా నిలించింది.
దీంతో 114 పరుగుల లక్ష చేధనలో బరిలోకి దిగిన మెదక్ జట్టు కేవలం 12.4 ఓవర్లు ఎదుర్కొని 57 పరుగులకే ఆలౌట్ కావడంతో 56 పరుగులు తేడాతో ఓటమి మూటకట్టుకుంది. వరంగల్ జట్టులో బ్యాటింగ్ లో రాణించడమే కాకుండా బౌలింగ్‌లో సైతం 2 వికెట్లు తీసి వరంగల్ జట్టును ఒంటి చేత్తో గెలిపించింది సాయి ధృవిగ్య్న. వరంగల్‌లోని మొగిలిచర్ల గ్రౌండ్లో జరిగిన మరో మ్యాచ్‌లో నిజామాబాద్ జట్టుపై ఖమ్మం జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. నిజామాబాద్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేయగా ఖమ్మం జట్టులోని ఓపెనర్స్ ఇద్దరు నాటౌట్‌గా యశ్వేశ్విని 37 పరుగులు, వైష్ణవి 48 పరుగులు చేసి కేవలం 16.1 ఓవర్లలోనే 103 పరుగులు సాధించి విజేతగా నిలిచిందని శ్రీనివాస్ తెలిపారు.

ఖమ్మం జట్టు..
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

