B Pharmacy | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 26 : కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్‌లో బీ ఫార్మసీలో ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ జే కృష్ణవేణి తెలిపారు.
టీజీఎప్‌సెట్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఆసక్తిగల అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల కోసం అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజుతో యూసీపీఎస్సీ కేయూ క్యాంపస్‌లో స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చన్నారు. 9 సీట్లు ఖాళీ ఉన్నాయని.. ట్యూషన్ ఫీజు రూ.45 వేలు, స్పాట్ ఫీజు అర్హత కలిగిన అభ్యర్థులకు రూ.1300, అర్హత లేని అభ్యర్థులకు రూ.2100 ఉంటుందన్నారు.
స్పాట్ అడ్మిషన్ల ద్వారా అడ్మిషన్ పొందిన అభ్యర్థులు ఎలాంటి ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కారని ప్రిన్సిపాల్ జే కృష్ణవేణి తెలిపారు.
Read Also :
Jigris Release Announcement | విడుదల తేదీని ప్రకటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్’
Nara Rohith | మొదలైన నారా రోహిత్ పెళ్లి పనులు.. హల్దీ వీడియో వైరల్