హనుమకొండ చౌరస్తా, మార్చి 16 : బందెల సురేష్‌కు సేవరత్న నేషనల్ అవార్డు లభించింది. బజన సాహిత్య అకాడమీ(బీఎస్ఏ) ఆధ్వర్యంలో ఈనెల 15న తిరుపతిలో జరిగిన సౌత్ ఇండియా బజన రైటర్స్ 18వ నేషనల్ కాన్ఫరెన్స్‌లో బీఎస్ఏ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యు.సుబ్రమణియన్ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం బజన సాహిత్య అకాడమీ ప్రతియేటా ప్రజాఉద్యమకారులకు, సంఘసేవకులకు, రచయితలకు, కవులకు, స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. తనకు అవార్డు రావడం పట్ల సురేష్ మాట్లాడుతూ ఈ అవార్డు మరింత సేవను గుర్తుచేస్తుందన్నారు.