Dharmasagar | పార్టీ మీటింగులకు పిలువడం లేదని వ్యక్తిపై దాడి.. నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పై ఇటివల జరిగిన దాడిలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు ధర్మసాగర్ సీఐ అనుముల శ్రీనివాస్ తెలిపారు.
ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పై ఇటివల జరిగిన దాడిలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు ధర్మసాగర్ సీఐ అనుముల శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వేలేరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎండీ సద్దాం హుస్సేన్ అనే వ్యక్తి తనపై రౌడీషీట్ ఉన్నందున మండల పార్టీ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్ తనను పార్టీ మీటింగ్ లకు సమాచారం ఇవ్వడంలేదని నెపంతో మండల పార్టీ అధ్యక్షుడు పై కక్ష్య పెంచుకున్నారు.
కాగా వేలేరుకు చెందిన మరో ముగ్గురు అనిల్, హరీష్, కృపసాగర్ అనే ముగ్గురితో కలిసి లక్ష్మణ్ నాయక్ పై హత్యాయత్నానికి ప్రణాళిక రూపొందించారు. ఈనెల 17 న లక్ష్మణ్ నాయక్ బైక్ పై హనుమకొండకు వెళ్లి వస్తుండగా ధర్మసాగర్ మండల సాయిపేట, కేషవనగర్ శివారులో హరీష్, కృపసాగర్ అనే ఇద్దరు బైక్ పై ముసుగు ధరించి లక్ష్మణ్ నాయక్ ను ఇనుప రాడ్డుతో దాడి చేసి పారిపోయారు. బాధితుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ధర్మసాగర్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా కేసు దర్యాప్తులో వేలేరు ఎస్ఐ అజ్మీర సురేష్ చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించారని సీఐ శ్రీనివాస్ అభినందించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

