ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ 2026- 27 సాంస్కృతిక పోటీల్లో హనుమకొండ వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల(అటానమస్) అధ్యాపకులు తమ అద్భుతమైన కళాప్రతిభను చాటారు.
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 30: హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ 2026- 27 సాంస్కృతిక పోటీల్లో హనుమకొండ వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల(అటానమస్) అధ్యాపకులు తమ అద్భుతమైన కళాప్రతిభను చాటారు. జానపద బృంద నృత్యం, సోలో గానం విభాగాల్లో ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. కళాశాలకు చెందిన అధ్యాపకులు సువర్ణ, సుభాషిణి, జ్యోతి, పద్మ, పి.అరుణ, రేణుక, మాధవి, కల్పన జానపద బృంద నృత్యాన్ని అత్యంత వైభవంగా ప్రదర్శించారు. తెలంగాణ జానపద సంస్కృతి, సంప్రదాయాల సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ, సమన్వయం, లయబద్ధత, నృత్య విన్యాసాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణ, జానపద కళా వైభవం వారి ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అదేవిధంగా సోలో సింగింగ్ పోటీల్లో పీడీ సుజాత, సామ్యూల్, ప్రవీణ్‌కుమార్ తమ మధురమైన గాత్రంతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి సంగీతాభిమానులను అలరించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, కల్చరల్ కోఆర్డినేటర్ ఆర్.లక్ష్మీకాంతం, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు ఈ సందర్భంగా పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రదర్శన చేసిన అధ్యాపక బృందాన్ని అభినందించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | విభేదాలొచ్చాయని ఆ బంధాన్ని అత్యాచారంగా పరిగణించలేం : సుప్రీంకోర్టు
Double Bedroom Homes | పేదలకు అందని డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకే..!
Chinese Food | చైనీస్ ఫుడ్ వండేటప్పుడు పాత్రలపై మంటలు వస్తాయి.. ఎందుకని..?
Vatsala Rajagopal | ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ కన్నుమూత!
Kranthi Kiran | కరువు మండలాలుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

