Pawan kalyan | నిరంజన్ కుటుంబ జీవనోపాధికి క్యాంటీన్ .. పవన్ కల్యాణ్ హామీ
Pawan kalyan | నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లిదండ్రులకు భరోసానిచ్చారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయం కూడా అందించారు. ఈ సందర్భంగా నిరంజన్ ఓ కుక్క పిల్ల బొమ్మ చూపి పెంచుకోవాలని ఉందని చెప్పగా, కొని పంపుతానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
Pawan kalyan | జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నహనుమకొండకు చెందిన అభిమాని నిరంజన్ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ నేడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన పవన్ కల్యాణ్ తల్లిదండ్రులకు భరోసానిచ్చారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయం కూడా అందించారు.
ఈ సందర్భంగా నిరంజన్ ఓ కుక్క పిల్ల బొమ్మ చూపి పెంచుకోవాలని ఉందని చెప్పగా, కొని పంపుతానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకోవడానికి ఇంటి ఓనర్స్ అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా, స్వయంగా పవన్ కల్యాణ్ ఆ ఇంటి ఓనర్స్‌ను పిలిపించి మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రుల వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటిన్లో పని చేసేవారమని చెప్పగా.. వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ నాయకులు రాధారం రాజలింగం, ఆర్కే సాగర్ తదితరులు ఉన్నారు.
Read Also :
Pawan Kalyan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్ కల్యాణ్
KTR | పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి : కేటీఆర్
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

