కేసీఆర్ హయాంలోనే ఆలయాల అభివృద్ధి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
కేసీఆర్ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
లింగాల గణపురం. అక్టోబర్ 16 : కేసీఆర్ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని జీడికల్ దేవాలయంలో ఆయన శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో జీర్ణావస్థలో ఉన్న ఆలయాలను అభివృద్ధిలోకి తీసుకువచ్చింది కేసీఆర్ అని చెప్పారు. జీడికల్ను పర్యాటక కేంద్రంగా ప్రకటించి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి పరిచారన్నారు.
రాష్ట్రంలో కాళేశ్వరం ద్వారా నీళ్లను ఎత్తిపోసి..నాణ్యమైన విద్యుత్తును 24 గంటలు అందించే అవకాశం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చేతకాక చేతులెత్తేసి రైతులను గోసపెడుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు తలిగి తప్పక కూలిపోతుందన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని రైతులకు సాగు నీరును అందించి.. విద్యుత్ సరఫరా చేసి రైతుల కష్టాలు తీర్చాలన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ తాము రైతు పక్షాన నిలిచి పోరాడుతామన్నారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయగా రిటైర్డ్ ఈవో కేకే రాములు. సిబ్బంది కొండబోయిన భరత్ కుమార్. మల్లేశం. అంతకుముందు పూజారులు మురళీధర్, సురేష్ కుమార్ ఆలయ సంప్రదాయం ప్రకారం ఆహ్వానించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్పై రాజ్నాథ్ సింగ్ ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

