Nagulachaviti | వేయిస్తంభాల గుడిలో నాగులచవితి సుబ్రహ్మణేశ్వరస్వామికి పూజలు
చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో కార్తీకశుద్ధ చవితి నాగుల చవితి ని పురస్కరించుకొని ఉదయం ఉత్తిష్ట గణపతికి నవరసాభిషేకం రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 13: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో కార్తీకశుద్ధ చవితి నాగుల చవితి ని పురస్కరించుకొని ఉదయం ఉత్తిష్ట గణపతికి నవరసాభిషేకం రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఆలనాట్యమండపంలో ప్రతిష్టించి శోడశోపచార పూజలు అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరలతో పంచామృతాభిషేకం నిర్వహించారు.
వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి సన్నిధిలో నాగేంద్రస్వామి సన్నిధిలో కార్తిక దీపాలు వెలిగించడం, పుట్టలలో పాలుపోసి పూజలు చేశారు. వైదిక కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, వేద పండితులు మణికంఠశర్మ, అర్చకులు దత్త కుమార్ శర్మ, పణవ్ , శ్రవణ్ , కాశీ లింగాచారి, వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ సిబ్బంది మధుకర్ , రామకృష్ణ, రజిత సేవలందించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

