హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 27: రోస్టర్ సవరణ సాధనకై అక్టోబర్ 4వ తేదీన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించే మాల విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సభను విజయవంతం చేయాలని కాకతీయ యూనివర్సిటీ అంసా అధ్యక్షుడు గుండు రాజేష్ పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్లు కేయూ మొదటి గేటు వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుండు రాజేష్ మాట్లాడుతూ మాల సమాజపు హక్కుల పరిరక్షణకు, రోస్టర్ వర్గీకరణలో జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దుకునేందుకు ఈ సభ అత్యంత కీలకమైందన్నారు.
ఓయూలో జరిగే ఈ మహాసభకు ప్రతీ మాల విద్యార్థి, నిరుద్యోగి, ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాల విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ మాదాస్ రాహుల్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో కేయూ ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, పీహెచ్డీ స్కాలర్స్, పీజీ విద్యార్థులు, మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.