హనుమకొండ చౌరస్తా, జనవరి 4: ఈనెల 5 నుంచి 9 వరకు పంజాబ్‌లోని ఛండీఘర్ యూనివర్సిటీలో జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ రెజ్లింగ్ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ రెజ్లింగ్(మెన్స్) జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వెంకయ్య తెలిపారు.
ఎంపికైనవారిలో బొల్లికుంట వాగ్దేవి కాలేజీ నుంచి ఎస్.దిలీప్, ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్.వంశీకృష్ణ, కేడీసీ నుంచి ఎస్.నితిన్, కేయూ నుంచి ఎం.సాయికుమార్, కేడీసీ నుంచి ఏ.రాల్, బొల్లికుంట వాగ్దేవి నుంచి సీహెచ్.ప్రీతమ్, న్యూసైన్స్డిగ్రీ కాలేజీ నుంచి ఎన్.కార్తిక్, హనుమకొండ వాగ్దేవి నుంచి టి.అనిల్, కేయూ నుంచి వై.జంపన్న, వీరికి బొల్లికుంట వాగ్దేవి కాలేజీ పీడీ పి.లక్ష్మీపతి కోచ్-కమ్-మేనేజర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు.