CPI | ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి : కర్రె బిక్షపతి
వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 324 లో ఎట్టకేలకు పేదలు ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జెండాలు పాతి ప్రత్యక్ష పోరాటాన్ని ప్రారంభించారు.
ఐనవోలు : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 324 లో ఎట్టకేలకు పేదలు ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జెండాలు పాతి ప్రత్యక్ష పోరాటాన్ని ప్రారంభించారు. అనేక సంవత్సరాలుగా ఇదే గ్రామానికి సంబంధించిన నిరుపేదలు గ్రామంలో ఉన్న వ్యవసాయానికి యోగ్యమైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, అట్టి భూమిని ప్రభుత్వం వెలికి తీసి పంచాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు అసెంబ్లీలో ఈ భూ సమస్యను ప్రస్తావించిన తర్వాత జిల్లా రెవెన్యూ యంత్రాంగం కదలి సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని తేల్చింది. దీంతో పేదలంతా అట్టి భూమిని తమకు పంపిణీ చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఆఖరికి సీఎంకు కూడా విన్నవించారు. అధికారులు స్పందికపోవడంతో పెద్ద ఎత్తున పేదలంతా కదిలి భూమిలో ఎర్రజెండాలు పాతారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కర్రే భిక్షపతి మాట్లాడుతూ ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ భూమికి పూర్తిస్థాయిలో హద్దులు నిర్ణయించి పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, నాయకులు మునిగాల బిక్షపతి, కొట్టపాక రవి, ఏదునూరి వెంకట్రాజం, అలవాల రాజు, మునగాల స్వామి, మాదాసి యాకుబ్, గుమ్మడి రాజుల సుధాకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sweet Potato | రూ.20కే లభించే ఈ కూరగాయతో ఎంతో ఆరోగ్యం.. చలికాలంలో తప్పక తినాల్సిందే.. ఎందుకంటే..
Dasoju Shravan Kumar | ఆ రూ.300 కోట్లు గంగలో కలిసినయి.. ఇప్పుడు ఇంటర్ బోర్డు రద్దంటున్నడు : ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్
POCSO case | ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
Pre Diabetes | ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి.. ఈ దశ నుంచి ఎలా బయట పడాలి.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Disha Patani | సైకిల్ పక్కన దిశా పటానీ అందాల పోజులు.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

