సీఎం కేసీఆర్‌తోనే దేవాదుల పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి | తెలంగాణ జల ప్రదాత కేసీఆర్ కృషితోనే దేవాదుల ప్రాజెక్టు పూర్తవుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

హనుమకొండ : తెలంగాణ జల ప్రదాత కేసీఆర్ కృషితోనే దేవాదుల ప్రాజెక్టు పూర్తవుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సాగునీటి అవసరాలకు తీర్చేందుకు సీఎం కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును పూర్తిగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు కేటాయించారని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ప్రతి చెరువు నిండేలా, ప్రతి ఎకరం పండేలా సీఎం కేసీఆర్ పట్టుదలతో పని చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రాజెక్టు చివరి దశ పనులు వేగంగా పూర్తవుతున్నాయన్నారు.
ఆదివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఆయన మంత్రి సత్యవతిరాథోడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, వరంగల్ ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి దేవాదుల ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. భూసేకరణ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. దేవాదుల సాగునీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టారని చెప్పారు.
నియోజకవర్గాలు, గ్రామాల వారీగా దేవాదుల ప్రాజెక్టు నీరు వినియోగంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. యాసంగి సీజన్ మొదలయ్యేలోపు అన్ని పెండింగ్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. కొన్ని చోట్ల భూసేకరణ సమస్యలు, యూటీల నిర్మాణం వంటివి చేపట్టాల్సి ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
అంగన్ వాడీలకు అండగా ఉంటాం : మంత్రి హరీశ్‌రావు
Taliban and Weapons : తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
Rain Alert | రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

