Volleyball | రాష్ర్టస్థాయి వాలీబాల్ జట్టుకు ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి ఎంపిక
కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీకి చెందిన విద్యార్థి రాష్ర్టస్థాయి వాలీబాల్ జట్టుకు ఎంపికయ్యాడు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 13: కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీకి చెందిన విద్యార్థి రాష్ర్టస్థాయి వాలీబాల్ జట్టుకు ఎంపికయ్యాడు. బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న నందు ఈనెల 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన రాష్ర్టస్థాయి వాలీబాల్ జట్టు ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ర్ట జట్టుకు ఎంపికయ్యాడు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడారంగంలోనూ విద్యార్థులు ప్రతిభను చాటుకోవడం అభినందనీయమన్నారు. రాష్ర్టస్థాయి జట్టుకు ఎంపికైన నందును అభినందిస్తూ, భవిష్యత్తులో జాతీయస్థాయిలోనూ రాణించి కళాశాలకు, విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు కళాశాల అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ ఎస్.ఎన్.రెహమాన్, ఫిజికల్ డైరెక్టర్ ఏటిబీటీ ప్రసాద్ పాల్గొని నందును అభినందించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

