Warangal : గ్రామదేవతల అనుగ్రహంతో అందరూ బాగుండాలి
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి
- ఏలేటిరామయ్యపల్లిలో వైభవంగా బొడ్రాయి వేడుకలు

చిట్యాల : గ్రామ దేవతల అనుగ్రహంతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టశ్వర్యాలతో తలతూగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఏలేటిరామయ్యపల్లి గ్రామంలో జరుగుతున్న గ్రామదేవతల ప్రతిష్ఠాపన వేడుకలకు వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతితో కలిసి హాజరయ్యారు. ప్రతిష్ఠాపించిన భూదేవి, లక్ష్మి సమేత నాబిశిల బొడ్రాయి, పోచమ్మతల్లి విగ్రహాలకు గండ్ర దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామదేతల అశీస్సులు ఎల్లవేళల గ్రామంపై ఉండి పాడిపంటలు, పశుసంపద పెంపొంది ఆయురాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
గ్రామంలో పూర్తి స్థాయిలో నిర్మించబోతున్న ఆంజనేయస్వామి ఆలయానికి తమ వంతుగా కృషి చేస్తామని గండ్ర దంపతులు గ్రామస్తుల సమక్షంలో హామీ ఇచ్చారు. దేవాతాముర్తుల పేరు మీదుగా అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోదావీరారెడ్డి, జడ్పీటీసీ గొరెసాగర్, స్థానిక సర్పంచ్ ఏలేటి సరోజనలింగారెడ్డి, ఎంపీటీసీ కట్కూరి పద్మ, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఆరెపెల్లి మల్లయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఏరుకొండ గణపతి, సర్పంచ్ పూర్ణ చందర్రావు, కో-ఆప్షన్ మెంబర్ రాజమహ్మద్, నాయకులు, నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

