నర్సింహులపేట ఏప్రిల్ 9 : ఆకేరువాగు నుండి రాత్రి, పగలు లేకుండా విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చేస్తుండటంతో ట్రాక్టర్ల చప్పుడుకు నిద్ర కరవుతుందని మండలంలోని పడమటి గూడెం గ్రామస్తులు మంగళవారం రాత్రి ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్లకు ప్రజలకు గొడవ చోటుచేసుకుంది. సంబంధిత మైనింగ్, రెవెన్యూ, పోలీస్, అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
జయపురం, ముంగిమడుగు, రామన్నగూడెం, కొమ్ములవంచ నుండి ఇసుక ట్రాక్టర్లు స్పీడ్ గా నడుపుతుండడంతో రోడ్డు పైకి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ యజమానులు ఇచ్చే ముడుపుల కు ఆశపడి అధికారులు ప్రజలను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి సామాన్య జనాన్ని కాపాడాలని కోరుతున్నారు.