అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అంటారు. ఆపదలో ఉన్న వారిని రక్షించడంలో రక్తానిదే ప్రధాన పాత్ర. అత్యవసర సమయంలో బాధితుల కు అందించేందుకు పలు బ్లడ్ బ్యాంకులు సైతం ఏర్పాటయ్యా యి. ఈ కేంద్రాలకు నేరుగా వచ్చే వారితో పాటు పలు ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని సేక రించి నిల్వ చేస్తుంటారు. అయితే ఇలా సేకరించిన యూనిట్లు ప్రస్తుతం పక్కదారి పడుతున్నాయా? లేక ప్రైవేట్‌కు విక్రయిస్తున్నా రా? అనే అనుమానాలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రవేశ పెట్టిన ‘ఈ-రక్తకోష్’ యాప్ సాక్ష్యంగా నిలుస్తున్నది. ఇటీవల ములుగు జిల్లాలో సేకరించిన రక్తం యూ నిట్ల వివరాలు ఇందులో కనిపించడం లేదు. ఇక్కడ రక్తదాన శిబిరంలో పాల్గొన్న రెండు బ్లడ్ బ్యాంకుల్లో ‘స్టాక్ నాట్ అవైలబుల్’ అని చూపిస్తుండడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది.
అత్యవసర సమయంలో రోగులకు కావాల్సిన రక్తం యూనిట్ల వివరాలు ఆన్లైన్లో తెలుసుకునేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ‘ఈ-రక్త్‌కోష్’ అనే యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో సమీపంలో ఉన్న బ్లడ్ బ్యాంకులు, అందులో నిల్వ ఉన్న వివిధ గ్రూప్‌ల రక్తం యూనిట్లు, రక్తదాన శిబిరాల వంటి వివరాలు అందుబాటులో ఉంటాయి. రక్తదాన శిబిరాలు, బ్లడ్ బ్యాంకుకు వచ్చి రక్తం ఇచ్చే వారి వివరాలు, గ్రూప్‌ల వారీగా యూనిట్ల సంఖ్యను ఎప్పటికప్పుడు నిర్వాహకులు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
అయితే కొందరు నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ-రక్త్‌కోష్ యాప్‌లో ఈ వివరాలు నమోదు చేయడం లేదు. ఇందుకు ఉదాహరణగా హనుమకొండలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో పాటు ఎంజీఎం దవాఖానలో కొనసాగుతున్న బ్లడ్ బ్యాంకులు నిలిచాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించిన సమయంలో సంబంధిత రెండు బ్లడ్ బ్యాంకుల సిబ్బంది శిబిరాలకు హాజరై రక్తాన్ని సేకరిస్తారు. ఎంజీఎం బ్లడ్ బ్యాంకులో ఆస్పత్రికి వచ్చే రోగులతో పాటు ప్రైవేటు దవాఖానలోని పేషెంట్లకు నామ మాత్రపు రుసుముతో రక్తాన్ని ఇస్తారు. రెడ్ క్రాస్‌లో మాత్రం ఫీజు వసూలు చేస్తారు.
కనిపించని రక్త నిల్వలు
ములుగు జిల్లా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మార్చి 28న మెగా రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహించారు. ఇందులో జిల్లాకు చెందిన ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసు అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఎంజీఎం బ్లడ్ బ్యాంక్ సిబ్బంది 148, ఇండియన్ రెడ్ క్రాస్ (ఐఆర్సీ) సిబ్బంది 132, మొత్తం 280 యూనిట్ల రక్తం సేకరించారు. అయితే సేకరించిన రక్తాన్ని నిబంధనల మేరకు పలు పరీక్షలు నిర్వహించి యూనిట్ల వివరాలను ఈ-రక్త్‌కోష్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉండగా అది ఇంత వరకు జరగలేదు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్‌లో స్టాక్ నాట్ అవైలబుల్ అని యాప్‌లో చూపిస్తున్నది. 2025 ఫిబ్రవరి 19 నుంచి ఈ యాప్‌లో వివరాలు నమోదు చేయనట్లుగా కనిపిస్తున్నది. అలాగే ఎంజీఎం బ్లడ్ బ్యాంక్‌లో జనవరి 23, 2025 నుంచి వివరాలు నమోదు చేయలేదు. అయితే వివిధ గ్రూప్‌లకు చెందిన 53రక్తం యూనిట్లు మాత్రం అందుబాటులో ఉన్నట్లు చూపిస్తున్నది. ఇటీవల ములుగులో సేకరించిన 280 రక్త యూనిట్ల వివరాలు ఈ రెండు బ్లడ్ బ్యాంకుల్లో ఎందుకు చూపించడం లేదో అర్థం కాని ప్రశ్నగా మారింది. సేకరించిన రక్తాన్ని ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు తరలించారా? లేక బ్లాక్ మార్కెట్లో విక్రయించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తే ఆ యూనిట్లను కేంద్రాల నిర్వాహకులు ఏం చేశారు? అనేది చర్చనీయాంశంగా మారింది. బ్లడ్ బ్యాంక్‌లను పర్యవేక్షిస్తున్న ఔషధ నియంత్రణ శాఖ అధికారులను ఈ విషయమై వివరణ కోరగా శిబిరాలు నిర్వహించే సమయంలో ముందస్తుగా తమ అనుమతులు పొందడంతోపాటు సేకరించిన రక్తం యూనిట్లను ఎక్కడికి తరలిస్తున్నారనే సమాచారాన్ని అందించాల్సి ఉంటుందన్నారు. అయితే ములుగులో నిర్వహించిన రక్తదాన శిబిరానికి తమ నుంచి ఎలాంటి అనుమతి పొందలేదన్నారు. అయితే రక్తదాన శిబిరాల పేరుతో సేకరించిన యూనిట్లను నిబంధనల మేరకు ఈ-రక్త్‌కోష్ యాప్‌లో నమోదు చేయాలని, నిర్లక్ష్యం చేస్తున్న బ్లడ్ బ్యాంకులపై శాఖాపరమైన చర్యలకు వెనుకాడేది లేదని అధికారులు పేర్కొన్నారు.