లింగాలఘనపురం, సెప్టెంబర్ 11 : తమ్ముడి మృతిని తట్టుకోలేక ఓ అక్క గుండె ఆగింది. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మం డలం నెల్లుట్లలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు..
గ్రామానికి చెందిన గాడిపెల్లి శంకర్ (50) కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. ఆదే గ్రామంలో నివాసం ఉం టున్న ఆయన అక్క కొలుపుల రుక్కమ్మ (54) తమ్ముడిని చూసి గుండెపోటుకు గురైంది. కుటుంబ సభ్యు లు చికిత్స నిమిత్తం జనగామ, అనంతరం హైదరాబాద్లోని దవాఖానలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన నెల్లుట్లలో విషాదాన్ని నింపింది.