ఏటూరునాగారం, డిసెంబర్ 23: సీఆర్టీలు గా ఆదివాసీ అభ్యర్థులనే నియమించాలని, జనరల్ నోటిఫికేషన్ రద్దు చేయాలని తుడుందెబ్బ ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏ ఎదుట జాతీ య రహదారిపై ధర్నా చేపట్టారు. వై జంక్షన్ నుం చి ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయ భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను తొలగించాలంటూ నినాదాలు చేశారు. అనంత రం సంఘం జిల్లా అధ్యక్షుడు పులిశె బాలకృష్ణ, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొ ప్పుల రవి మాట్లాడుతూ.. మంత్రి సీతక్క కంచు కోటలో గిరిజనులకు వ్యతిరేకంగా ఐటీడీఏలో అధికారుల పాలన నడుస్తున్నదని అన్నారు.
మం త్రి వెంటనే స్పందించాలని కోరారు. ఏజెన్సీలో స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని, షెడ్యూల్డ్ ప్రాం తంలోని 29 శాఖల్లో రిజర్వేషన్ అమలు చేసేలా ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. వార్డెన్ల నుంచి కమిషన్ తీసుకుంటున్న డీడీ పోచంను సస్పెండ్ చేయాలన్నారు. గిరి వికాస్ కింద బోర్లు మంజూ రు చేయాలని, పెండింగ్‌లో ఉన్న కరెంటు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలన్నారు. ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సీఆర్టీలను రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని కోరారు.
తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 30న పెద్ద ఎత్తున ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు పొడెంబాబు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దబ్బగట్ల శ్రీకాంత్, ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహమూర్తి, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పాయం అనిత, ఏటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మైపతి సంతోశ్, పీ కోటేశ్వర్రావు, కుంజ మహేశ్, ఆయా సంఘాల నాయకులు వంక నరేశ్, గుండ్ల పాపారావు, చేల శమంతకమణి, ఈసం స్వరూప, బడే సులోచన, కొమురం వెంకటేశ్వర్లు, ఆలం నగేశ్ పాల్గొన్నారు.