నమస్తే నెట్వర్క్ : సోదర సోదరీమణుల మధ్య ఆత్మీయత, ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ. అమ్మలోని అనురాగం.., నాన్నలోని ప్రేమ కలగలిపిన బంధం ఇది. అన్నా, తమ్ముళ్లకి రాఖీ కట్టి నిత్యం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని అక్కా చెల్లెళ్లు కోరుకుంటారు.
అలాగే సోదరులు కూడా వారికి ఎల్లవేళలా తోడుగా ఉంటారని భావిస్తారు. సోమవారం రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ఆడపడుచులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో రంగురంగుల రాఖీలు, మిఠాయిలు కొనుగోళ్లు, అమ్మకాలతో హనుమకొండ జిల్లా టైలర్స్ స్ట్రీట్ సందడిగా మారింది.