దామెర : దామెర మండలం ఓగులాపూర్ వద్ద టిప్పర్, వాటర్ ట్యాంకర్ ఢీ కొన్న ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గూడెపాడ్ నుంచి వరంగల్ వైపు రాంగ్ రూటులో రోడ్డు పక్కన ఉన్న చెట్లకు నీరు పోస్తూ వస్తున్న వాటర్ ట్యాంకర్ ( Water Tanker) , వరంగల్ నుంచి గుడేపాడు వైపు వెళ్తున్న టిప్పర్( Tipper ) వాహనాన్ని ఢీ కొంది.
ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ (45) అక్కడికక్కడే మృతిచెందగా రంగారెడ్డి జిల్లా నవాబుపేటకు చెందిన మాదారం గోపాల్(32), జార్ఖండ్ రాష్ట్రం పోచమ్మ గ్రామానికి చెందిన కార్తీక్ (25)కు తీవ్ర గాయాలయ్యాయి. తెలియాల్సి ఉంది. ఘటన స్థలాన్ని శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి, దామెర ఎస్సై కొంక అశోక్ సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.