తొలి ఏకాదశిని పురస్కరించుకొని బుధవారం కురుమలు బీరన్న పండుగను ఘనంగా జరుపుకొన్నారు. డప్పుచప్పుళ్లు, కోలాటాలు, పోతరాజుల విన్యాసాలు, ఒగ్గు కళాకారుల నృత్యాలు, నెత్తిన బోనాలతో మహిళల బారులు, గొర్రె పిల్లను గావు పట్టే దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వరంగల్లోని ఓసిటీ, కరీమాబాద్, ఉర్సు, రంగశాయిపేటల్లో అంగరంగ వైభవంగా జరుగగా మంత్రి కొండా సురేఖ,
మేయర్ సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితరులు పాల్గొని బోనమెత్తి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జనగామ, భూపాలపల్లి సహా పలుచోట్ల మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో తీసిన ర్యాలీలు కట్టిపడేశాయి. కాగా సాయంత్రం బోనాలతో ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.
– నమస్తే నెట్వర్క్, జూలై 17