మల్లికార్జునుడికి బిల్వార్చన
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం స్వామి వారికి లక్ష బిల్వార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. కల్యాణం మరుసటి రోజు ఆలయ సంప్రదాయం మేరకు లక్ష బిల్వార్చన చేశారు.
- కల్యాణోత్సవాలు సమాప్తం
చేర్యాల, జనవరి 8 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం స్వామి వారికి లక్ష బిల్వార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. కల్యాణం మరుసటి రోజు ఆలయ సంప్రదాయం మేరకు లక్ష బిల్వార్చన చేశారు. అనువంశిక వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం స్వామి వారి ఆలయంలో స్వస్తిక్ పుణ్యాహవాచనం, గణపతి పూజ, పంచచార్య పూజలు, రుద్రాభిషేకం, బిల్వార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, హారతి, మంత్రపుష్పం, మహా నైవేద్యం తదితర కార్యక్రమాలు చేశారు. బిల్వాలను స్వామి మూలవిరాట్ వద్ద సమర్పించి 1008 మల్లన్న నామస్మరణతో పూజలు కొనసాగించారు. అర్చకుడు మహాదేవుని శ్రీనివాస్, మనోహర్ దంపతులు, ఆలయ ఈవో ఏ బాలాజీ, ఏఈవోలు వైరా గ్యం అంజయ్య, గంగా శ్రీనివాస్, ప్ర ధానార్చకుడు మహాదేవుని మల్లికార్జు న్, పర్యవేక్షకుడు నీల శేఖర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వేడుకలు ముగింపు
రెండు రోజుల వైభవంగా జరిగిన కల్యాణోత్సవాలు సోమవారం ముగిసినట్లు అర్చకులు ప్రకటించారు. సం క్రాంతి పర్వదినం అనంతరం వచ్చే మొదటి ఆదివారం రోజున పట్నం వారంతో తిరిగి జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. మొదటి ఆదివారం పట్నం వారం సందర్భంగా హైదరాబాద్ భక్తులు పట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలు నిర్వహించుకుంటారని వెల్లడించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

