BRS | బచ్చన్నపేట, జూలై 16 : మండలంలోని అన్ని గ్రామాల్లో గులాబీ పార్టీ జెండాలు ఎగరాలని, ఇందుకోసం ప్రతీ కార్యకర్త నాయకులు అంకితభావంతో పనిచేయాలని క్లస్టర్ ఇంచార్జిలు సూచించారు. మండలంలోని ఇటికలపల్లి, రామచంద్రపురం గ్రామాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు బుధవారం నిర్వహించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బచ్చన్నపేట మండలం పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సమావేశంలో పార్టీ నాయకులకు దిశా నిర్దేశాలను తెలియజేస్తూ బీఆర్ఎస్ గెలుపులో అందరూ కలిసికట్టుగా పార్టీ నిర్ణయించిన వ్యక్తిని ఏకగ్రీవంగా గెలిపించుకునే విధంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి లు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గద్దల నరసింహారావు, పెద్దిరాజు రెడ్డి సూచించారు.
మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, ఇన్చార్జి గుర్రం నాగరాజు, యెనగందుల కృష్ణ కొండ,మల్లికార్జున్, బిట్ల శంకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీ పాల్ రెడ్డి, మాజీ సర్పంచి వెంకట రెడ్డి గారు మాజీ ఉప సర్పంచి ఇంద్రా రెడ్డి, మాజీ ఎంపీటీసీ కనకయ్య గౌడ్, సీనియర్ నాయకులు బ్రహ్మచారి, సోషల్ మీడియా మండల్ కన్వీనర్ పడిగెల కరుణాకర్ రెడ్డి, రామచంద్రపురం గ్రామ శాఖ అధ్యక్షుడు చంద్రమౌళి, సీనియర్ నాయకులు ఎస్ కనకయ్య, కాగితాల నాగరాజు, బీఆర్ఎస్ ఇటుకలపల్లి రామచంద్రపురం సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
అదేవిధంగా జనగామ శాసనసభ్యుడు, అభివృద్ధి ప్రదాత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశానుసారం బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట గ్రామంలో క్లస్టర్ ఇన్చార్జిలు మాజీ కౌన్సిలర్ గజ్జెల నర్సిరెడ్డి , మాజీ కౌన్సిలర్ వంకుడోతు అనిత, జనగామ పట్టణ నాయకులు తిప్పారపు విజయ్, మండల నాయకులు ఇర్రి రమణారెడ్డితో కలిసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం క్లస్టర్ ఇన్చార్జిలు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా BRS అభ్యర్థులను గెలిపించుకోవడానికి కార్యకర్తలు అందరూ సమన్వయంతో కలిసికట్టుగా సిద్ధంగా ఉండాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేందర్ రెడ్డి, ఫిరోజ్, కిష్టయ్య, బాలకృష్ణ, భాస్కర్, సిద్ధార్థ, ఐలయ్య, బాలచందర్, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.