వరంగల్, మార్చి 3: తాగునీటి సరఫరాలో సమస్యలను అధిగమించి రోజూ సరఫరా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోని ఆమె చాంబర్లో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి శుక్రవారం బల్దియా, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లతో సమావేశమయ్యారు. 12, 13, 18, 22, 35, 40, 41 డివిజన్లో వర్షాకాలంలో ముంపు నివారణకు ముందస్తు చర్యలు, డివిజన్లలోని తాగునీటి సమస్యలపై మేయర్, కమిషనర్ కార్పొరేటర్లు, అధికారులతో సమీక్షించారు. కార్పొరేటర్లు తమ డివిజన్ పరిధిలో తాగునీటి సమస్యను వివరించారు. కార్పొరేటర్లు తమ దృష్టికి తీసుకొచ్చిన తాగునీటి సమస్యను పరిష్కరించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్ వరంగల్‌లో ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. డివిజన్లలోని తాగునీటి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. వేసవిలో గ్రేటర్ పరిధిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
సాంకేతిక సమస్యను అధిగమించాలి
లీకేజీలు, తాగునీటి సరఫరాలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను ప్రత్యేకంగా నియమించిన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ బోర్డు విశ్రాంత ఆపరేషన్ Mayor Gundu Sudharani ,aldia, Public Health Engineers ,Director Ravikumar ,Water , సహకారంలో అధిగమించాలని మేయర్ సుధారాణి కోరారు. మహా నగరంలోని అన్ని డివిజన్లకు రోజూ తాగునీటి సరఫరా జరిగేలా వాల్వ్‌లు, లీకేజీలు, తక్కువ ఫ్రెషర్ గల ప్రాంతాల గుర్తింపు, తాగునీటి సరఫరా తగినంత జరుగని ప్రాంతాలను గుర్తించి సమస్యను పరిష్కరించేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. దేశాయిపేట ప్రభుత్వ పాఠశాల సమీప ప్రాంతంలో తాగునీటి సమస్య ఉందని, చేతిపంపుల మరమ్మతులు, వర్షాకాలంలో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని 12వ డివిజన్ కార్పొరేటర్ కావేటి కవిత మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, తమ డివిజన్లో ఎనుమాముల నుంచి తాగునీటి సరఫరా సరిగా జరుగడం లేదని 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్‌జోషి అన్నారు. దేశాయిపేటలో అనేక ప్రాంతాల్లో పైపులైన్ దెబ్బతిన్నదని తెలిపారు. 18వ డివిజన్లోని ఎస్ఆర్టీ, టీఆర్టీ కాలనీలో తాగునీటి సమస్య ఉందని కార్పొరేటర్ వస్కుల బాబు తెలిపారు. వాసవీనగర్, బ్యాంక్‌కాలనీ, 80 ఫీట్ల రోడ్డు, ఎస్సీకాలనీలో తాగనీటి సమస్య ఉన్నట్లు చెప్పారు.
ఇంటర్ కనెక్షన్ ఇవ్వాలి
రాంనాథ్పురి, ఎంవీకాలనీలో ఇంటర్ కనెక్షన్ ఇవ్వాలని 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజ్ కుమారస్వామి తెలిపారు. శివనగర్, పుప్పాలగుట్ట, చింతల్, ఏసీరెడ్డినగర్ సిక్కుల వాడలో తాగునీటి సమస్య ఉందని, మిషన్ భగీరథ పైపులైన్ల ఇంటర్ కనెక్షన్లు ఇవ్వాలని, లీకేజీలను అరికట్టాలని 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. డివిజన్లోని 11, 17 బ్లాక్‌లకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని, మిషన్ భగీరథ పైపులైన్ వేయాలని, కొన్ని గృహలకు రెండు చొప్పున మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా కాశీకుంట, నాగేంద్రనగర్, చైనత్యనగర్ పైపులైన్ సౌకర్యం ఉన్నా తాగునీటి సరఫరా జరుగడం లేదని 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ తెలిపారు. కార్పొరేటర్లు తెలియజేసిన సమస్యలను పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని మేయర్ సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య అన్నారు. రోజూ 45 నిమిషాలు గృహలకు తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. నీటి సరఫరా నిర్వహణలో ఇబ్బందులు లేకుండా 125 మందిని న్యాక్ ద్వారా నియమిస్తున్నాట్లు తెపారు.v సమావేశంలో ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, రిటైర్ట్ సీఈ రవికుమార్, డీఈలు రవికిరణ్, నరేందర్, పబ్లిక్ హెల్త్ డీఈ రవింద్రనాథ్, కృష్ణ, స్వాతి, బల్దియా ఏఈ ముజామిల్ పాల్గొన్నారు.