మరిపెడ : నూతన భూభారతి చట్టం 2025 రెవెన్యూ గ్రామసభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి అన్నారు. మంగళవారం మండలంలోని పురుషోత్తమాయగూడెం, బురహాన్ పురం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 20 వరకు మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సు నిర్వహించి భూ సమస్యలు ఉన్న రైతుల నుంచి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శరత్ చంద్ర గౌడ్, పురుషోత్తమ గూడెం మాజీ సర్పంచ్ నూకల అభినవ్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.