హనుమకొండ చౌరస్తా, జనవరి 2 : రాష్ట్రస్థాయి సీఎంకప్ అథ్లెటిక్స్, రెజ్లింగ్ పోటీల్లో హనుమకొండ జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. మూడు రోజులుగా జవహర్లాల్ న్రెహూ స్టేడియం (జేఎన్ఎస్)లో జరుగుతున్న క్రీడలు గురువారం ముగిశాయి. హోరాహోరీగా సాగిన క్రీడాంశాల్లో హనుమకొండ జిల్లా అథ్లెట్లు సింథటిక్ ట్రాక్‌పై పరుగులు తీసి తొమ్మిది పతకాలు సాధించగా, రెజ్లింగ్‌లో ఏడు కైవసం చేసుకున్నారు. గురువారం జరిగిన పోటీలను సీఎం ఓఎస్డీ రవీందర్‌రెడ్డి ప్రారంభించి నిర్వహణపై డీవైఎస్వో అశోక్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు కల్పించిన సౌకర్యాలపై కోచ్‌లు, మేనేజర్లను అడిగి తెలుసుకోవడంతో పాటు భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అథ్లెటిక్స్‌లో..
మూడు రోజుల పాటు జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో హనుమకొండ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి 9 పతకాలు సాధించారు. అండర్-20 లాంగ్‌జంప్‌లో అంజి, సీనియర్ బాయ్స్‌లో దిలీప్ సిల్వర్, జూనియర్ బాయ్స్ 100, 200 మీటర్లలో ఎండీ కైఫ్ సిల్వర్, 600 మీటర్లలో కే ప్రణీత గోల్డ్, 100 మీటర్లలో పోశయ్య బ్రాంజ్, 400 మీటర్లలో కార్తీక్ సిల్వర్, షాట్‌పుట్‌లో రాహుల్ గోల్డ్, జావలిన్ త్రోలో స్వాతి బ్రాంజ్ మెడల్ సాధించారు.
రెజ్లింగ్‌లో..
రెజ్లింగ్ పోటీల్లో హనుమకొండ జిల్లా రెజ్లర్ల హవా కొనసాగింది. రెజ్లర్లు అద్వితీయ ప్రతిభ కనబరిచి 4 స్వర్ణ, ఒక రజత, రెండు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. సబ్ జూనియర్ 60 కేజీ విభాగంలో వీ గణేశ్ గోల్డ్, 53 కేజీల్లో బీ అంజలి, 48 కేజీల్లో ఎస్ అర్జున్సాగర్ కాంస్య, జూనియర్ బాలికల 50 కేజీల్లో బీ ప్రణవి, 59 కేజీల్లో జే చిన్ని, 61 కేజీల్లో కొర్ర అఖిల్ గోల్డ్, 57 కేజీల్లో ఏ రాహుల్ రజత పతకం సాధించారు. కాగా, పతకాలు సాధించిన క్రీడాకారులను డీవోఎస్వో అశోక్‌కుమార్, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, కోచ్ శ్రీమన్నారాయణ, తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ కరీం, వరంగల్, హనుమకొండ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శులు వై సుధాకర్, షేక్ రియాజ్, కోచ్‌లు కందికొండ రాజు, ఎం జైపాల్ అభినందించారు. కార్యక్రమంలో డీసీపీ దేవేందర్‌రెడ్డి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్, నిట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.