హనుమకొండ చౌరస్తా, మే 10: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ(జేఎన్ఎస్)లో జరిగాయి. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి 438 మంది అథ్లెట్లు, 50 మంది టెక్నికల్ అఫీషియల్స్ హాజరయ్యాయి. ఈ సందర్భంగా త్రోస్, జంప్స్‌తో పాటు 400 మీటర్ల పరుగు పందెంలో నిర్వహించిన పోటీల్లో గెలుపే లక్ష్యంగా అథ్లెట్లు పోటీపడ్డారు. ఒక్క రోజు మాత్రమే జరిగిన ఈ పోటీల్లో వివిధ జిల్లాల క్రీడాకారులు ప్రతిభ చాటారు.
ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అజీజ్‌ఖాన్, వరంగల్, జనగామ జిల్లాల అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుల్యాల కిషన్, పెద్ది వెంకటన్నారాయణ, క్రీడా పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.