కృష్ణకాలనీ, నవంబర్ 30 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేం ద్రంలోని యోధ సూపర్ స్పెషాలి టీ హాస్పిటల్లో స్టాఫ్‌నర్సుగా పని చేస్తున్న వివాహిత అనుమానాస్పదంగా శనివారం మృతి చెందింది. కుటుంబసభ్యుల కథనం ప్రకా రం.. భూపాలపల్లి పట్టణంలోని టీ-2 క్వార్టర్స్‌కు చెందిన ఎస్కే అఫ్సర్ బీ (28) కొన్నేళ్ల కిందట తన భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నది. జీవనోపాధి కోసం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న యోధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్నది. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి 8 గంటలకు విధులకు వెళ్లింది.
శనివారం తెల్లవారుజామున ఆసుపత్రి సి బ్బంది ఒకరు ఆమె తండ్రి మదాస్ వద్దకు వ చ్చి నీ కూతురు ఆరోగ్యం బాగాలేదు.. ఆస్ప త్రికి వెళ్దామని తీసుకెళ్లారు. అప్పటికే అఫ్సర్ బీ శరీరమంతా చల్లబడడంతో అంబులెన్స్ లో హనుమకొండకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. దీంతో దవాఖా న యాజమాన్యం మృతురాలిని ఇంటి వద్ద దింపేసి వెళ్లిపోయింది.
అయితే, దవాఖాన యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమె మృతి పై అనుమానాలు వ్యక్తం చేశారు. శరీర భాగాలపై గాయాలున్నాయ ని ఆవేదన వ్యక్తం చేశారు. దవాఖాన ఎదుట మృతదేహంతో ఆం దోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎస్సై సుధాకర్, సిబ్బందితో దవాఖానకు చే రుకొని ఆందోళనను విరమింపజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు సీఐ నరేశ్ కుమార్ తెలిపారు.
హాస్పిటల్ యాజమాన్యంపై అనుమానం ఉందని ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి ర వీందర్ అన్నారు. ఈ మేరకు ధర్మ సమాధి పార్టీ, టీఎస్ ఎమ్మార్పీఎస్, జనసేన, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. యాజమాన్యమే చంపిందని మండిపడ్డారు. తక్షణ సహాయం కింద రూ. 25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం లో డాక్టర్లే చంపారని తేలితే వెంటనే యాజమాన్యం, వైద్యులపై కేసు నమోదు చేయాల ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ, ప్రజాసంఘాల నాయకులు చిట్యాల సుమ న్, స్వర్ణక, సుజాత పాల్గొన్నారు.