మహబూబాబా రూరల్ : మండల పరిధిలోని జంగిలిగొండ గ్రామ క్రాస్ రోడ్డు వద్ద పట్టాలు కలిగిన ఖాళీ స్థలాలకు రక్షణ కల్పించాలని వడ్డెర సంఘం గ్రామ నాయకుడు కొమ్మనబోయిన సోమయ్య అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వడ్డెర సంఘం నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ 20010 సర్వే నెంబర్లు వడ్డెర కులస్తులకు స్థలాలను కేటాయించి పట్టాలను సైతం అందించిందని పేర్కొన్నారు.
ఆ స్థలంలో గత నెలలో వడ్డెర కులస్తుల ఆరాధ్య దైవం గంగమ్మ దేవత ఆలయం నిర్మించేందుకు స్థలాన్ని చదును చేస్తుండగా గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు కావాలని తమపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసులు పెట్టించారని పేర్కొన్నారు. దీనిపైన సంబంధిత రెవెన్యూ అధికారులు సర్వే చేసి తమకు పట్టాలు ఇచ్చిన స్థలాలకు రక్షణ కల్పించి హద్దులను నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకన్న, వీరయ్య, వీరభద్రం, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.