నల్లబెల్లి, జూన్ 13 : చెరువు కట్ట మరమ్మతు పనులను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి ప్రారంభించారు. మండలంలోని శనిగరం గ్రామపంచాయతీ శివారులో మైసమ్మ చెరువు కట్ట మరమ్మతుల కోసం నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి రూ.6 లక్షలు మంజూరు చేయగా ఈ పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి పనులను ప్రారంభించినారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పురుషోత్తం సురేష్, నాయకులు డేగల కృష్ణ, కూసబాబు, బోయిని రాజు, పోగుల కుమారస్వామి, పెరమాండ్ల సదయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.