వరంగల్, జూలై 17: నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో శాకంబరీ నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం ఉదయం కుల్లా క్రమంలో, సాయంత్రం నిత్యక్లిన్నా అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో సుప్రభాత సేవతో ప్రారంభమై నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన నిరాజనం, మంత్ర పుష్పాలతో ముగిసింది. అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్ళించుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈవో రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు.